మెడిసిన్ చేసి కార్డియాలజిస్ట్‌నవుతా - ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ టాపర్ రాహుల్
Sakshi Education
మెడిసిన్‌చేసి కార్డియాలజిస్ట్ కావడమే నా లక్ష్యం. ఇంటర్లో స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలుస్తానని ముందే ఊహించాను. ముందునుంచీ ప్రణాళికబద్ధంగా చదవడం, ఎప్పటికప్పుడు రివిజన్ చేయడం వలనే విజయం సాధ్యమైందని అంటున్నారు ఇంటర్ బైపీసీ టాపర్ అటుకుల రాహుల్. మంగళవారం ప్రకటించిన సీనియర్ ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 989 మార్కులతో స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలిచిన కరీంనగర్ జిల్లా, జగిత్యాల విద్యార్థి అటుకుల రాహుల్. ఆయనతో సాక్షి ఇంటర్వ్యూ...
స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఊహించారా?
ఫస్ట్‌ర్యాంకు వస్తుందని ముందే ఊహించాను. మా కాలేజ్‌లో లెక్చరర్లు సబ్జెక్టులవారీగా షెడ్యూల్ తయారుచేసి చదివించేవారు. ఏ సందేహం వచ్చిన తక్షణమే నివృత్తి చేసేవారు. దీంతో సబ్జెక్టులో సాధన పెరిగి, పట్టుసాధించగలననే ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యంగా స్టడీ అవర్లో మేం సాధించాల్సిన లక్ష్యాన్ని అడుగడుగునా గుర్తుచేసేవారు. ఫలితాలు వెలువడ్డాక చాలా సంతోషం కలిగింది. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన ఇది.
కుటుంబం, విద్యా నేపథ్యం?
మాది కరీంనగర్ జిల్లా, జగిత్యాల మండలం లక్ష్మీపూర్. ఒకటి నుంచి పదివరకు అక్కడే చదివాను. పదోతరగతిలో మొత్తం 551 మార్కులు సాధించాను. నాన్న వ్యవసాయ కూలీ.
మొత్తం మార్కులు?
నా హాల్‌టికెట్ నెంబరు 1218213229. మొత్తం మార్కులు సబ్జెక్టులవారీగా... ఇంగ్లిష్ 95, సంస్కృతం 99, బోటనీ 60, ఫిజిక్స్ 60, జువాలజీ 60, కెమిస్ట్రీ 60 చొప్పున మార్కులు వచ్చాయి.
సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ ఎలా?
కాలేజీలో లాంగ్వేజ్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టిసారించి చదివించారు. దాంతో ఎక్కువ మార్కులు సాధించగలమనే ధీమా పెరిగింది. సాయంత్రం వేళల్లో సబ్జెక్టులవారీగా షెడ్యూళ్లు ఇచ్చి చదివించేవారు. ప్రధానంగా జువాలజీ, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులకు కొంచెం కష్టం కావడంతో ఒకటికి పదిసార్లు సబ్జెక్టులు చదివాను. ఎప్పటి పాఠాలు అప్పుడే పూర్తి చేయడంతోపాటు తిరిగి మూడునాలుగు రోజుల తర్వాత రివిజన్ చేసేవాడిని. దీంతో సబ్జెక్టులపై పట్టుపెరిగి ఎక్కువ మార్కులు సాధించడానికి దోహదపడింది.
జీవిత లక్ష్యం?
మెడిసిన్ చదివి ఆతర్వాత కార్డియాలజిస్ట్‌నవుతా. దేశంలో గుండెజబ్బులు రానురాను పెరుగుతున్నాయి. ఒకపక్క పేషెంట్లు పెరుగుతున్నా.. చికిత్సనందించే వైద్యనిపుణులు మాత్రం పెరగడంలేదు. దేశంలో గుండె జబ్బులున్న పేషెంట్లు 2 మిలియన్ల మంది ఉంటే... వైద్యులు మాత్రం కేవలం 18వేల మంది మాత్రమే ఉన్నారు.
అందుకే గుండెజబ్బుల నివారణ, చికిత్స నిపుణుడిగా సేవచేయాలనేదే నా లక్ష్యం.
ఎక్కువ మార్కులు సాధించాలంటే?
పాఠాలను అర్థం చేసుకుని చదవాలి. ఎక్కువ మార్కులు సాధించాలనుకునేవారు ముందునుంచే లాంగ్వేజెస్‌పై దృష్టిసారించాలి. ఒకరకంగా ఇంగ్లిష్, సంస్కృతం సబ్జెక్టులో కనీసం 99 వరకు మార్కులు సాధించవచ్చు. కాలేజీలో ఎప్పటికప్పుడు చాప్టర్లు పూర్తై వెంటనే త్వరితంగా రివిజన్ ప్రారంభించాలి. దీనివలన పాఠం సులువుగా గుర్తుండిపోతుంది. అంతేకాదు.. పరీక్షకు రెండు నెలల ముందునుంచే రివిజన్ ప్రారంభించినా.. సబ్జెక్టు చదివిందే కాబట్టి ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

Published date : 24 Apr 2012 05:10PM