జేఈఈ అడ్వాన్స్-2020 ఆల్ ఇండియా టాపర్ చిరాగ్ ఫలోర్ సక్సెస్ స్టోరీ..
Sakshi Education
ఈ ఏడాది స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా 'బాల పురస్కార్' అవార్డు కూడా...
న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్-2020 ఫలితాల్లో పుణేకు చెందిన చిరాగ్ ఫలోర్ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. 352 మార్కులతో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ బాంబే జోన్ నుంచి అతడు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాశాడు. కాగా 317 మార్కులతో కనిష్కా మిట్టల్ అనే విద్యార్థిని బాలికల విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది.
ప్రధాని మోదీతో అనుబంధం...
ఈ ఏడాది జనవరి 24న చిరాగ్ ఫలోర్ ప్రతిష్ఠాత్మక 'బాల పురస్కార్' అవార్డు దక్కించుకున్నాడు. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం విశేషం. మాథ్స్, సైన్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొని ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలంపియాడ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన ట్విటర్‌లో షేర్ చేశారు.
Published date : 05 Oct 2020 07:14PM