కంప్యూటర్ సైస్స్‌లో చేరతా-ఇంజనీరింగ్ స్టేట్ 4వ ర్యాంకర్-కె.ధీరజ్‌రెడ్డి
Sakshi Education
ప్ర: ఎంసెట్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచినందుకు మీరెలా ఫీలవుతున్నారు?
చాలా ఆనందంగా ఉంది. ఎక్కువగా ప్రిపేర్ కాలేదు. ఐఐటీ తర్వాత 20 రోజులే సమయం ఉంది. అందులో 10 రోజులు ఒలంపియాడ్ టూర్‌కు వెళ్లాం. 10 రోజులే ప్రిపేర్ అయ్యాను. పరీక్ష రాసిన తర్వాత బాగా రాశాను అనిపించింది.
ప్ర: మీ కుటుంబ నేపథ్యమేంటి?
మాది నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి దగ్గర పల్లెపహడ్. నాన్న రెసిడెన్షియల్ కాలేజీలో జువాలజీ లెక్చరర్. అమ్మ గవర్నమెంటు స్కూల్ టీచర్.
ప్ర: ఇంజనీరింగ్ ఏ క ళాశాలలో చేరాలనుకుంటున్నారు?
ఐఐటీ బొంబాయి
ప్ర: ఏ బ్రాంచిని ఎంచుకుంటారు? ఎందుకు?
కంప్యూటర్ సైన్స్, లాజికల్‌గా ఉంటుంది. అందుకే ఇష్టం
ప్ర: మీ అకడమిక్ రికార్డు చెప్పండి?
8 నుంచి 10 వరకు నారాయణ ఒలంపియాడ్ స్కూల్లో చదివాను. 10వ తరగతిలో 565 (94 శాతం) మార్కులు వచ్చాయి. ఇంటర్ నారాయణ జూనియర్ కాలే జీ సెంట్రల్ బ్రాంచ్‌లో. 957 మార్కులు సాధించాను.
ప్ర: ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలు రాశారా?
రాశాను. ఏఐఈఈఈలో - 27వ ర్యాంకు, ఐఐటీ- జేఈఈలో 45వ ర్యాంకు, విఐటీ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు, ఐఎస్‌టీలో 22వ ర్యాంకులు సాధించాను.
ప్ర: ఓ వైపు ఇంటర్మీడియెట్ పరీక్షలకు ప్రిపేరవుతూనే ఎంసెట్‌కు ఎలాంటి ప్రిపరేషన్‌ను అనుసరించారు?
ఐఐటీ ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ జూన్ నాటికే పూర్తి అయింది. 8 నెలలు సొంత ప్రణాళిక ప్రకారం చదవడానికి సమయం ఇచ్చారు. ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలో అధ్యాపకులు సలహా ఇచ్చేవారు. ఐఐటీకి అయితే మైక్రో షెడ్యూల్ ఇచ్చారు. దాన్ని అమలు చేశాను. ఐఐటీ తర్వాత ఉన్న పదిరోజులు ఎంసెట్‌కు మాత్రమే ఉండే సిలబస్‌ను ఎక్కువగా కవర్ చేశాను. ఎక్కువ మాక్ టెస్టులు రాశాను.
ప్ర: కాలేజీలో బోధన, కోచింగ్ ఎంతవరకు ఉపకరించింది?
ఫిజిక్స్ ఎక్కువగా ఉపయోగపడింది. ఫిజిక్స్ సార్ బాగా అర్థం అయ్యేట్టు బోధించేవారు. మ్యాథ్స్, కెమిస్ట్రీలో సార్ చెప్పిన పాఠాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి.
ప్ర: మీరు ప్రత్యేకంగా ఏవైనా బుక్స్ ప్రిపేరయ్యారా?
కెమిస్ట్రీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివాను. ఫిజిక్స్, మ్యాథ్స్‌కు ముందుగా తయారు చేసుకున్న నోట్సు ప్రిపేర్ అయ్యాను.
ప్ర: అధ్యాపకులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం?
మా కుంటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. తక్కువ మార్కులు వచ్చినా ఏమీ అనకుండా చదువుకోవడానికి వీలుగా నన్ను ప్రోత్సహించేవారు.
ప్ర: భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు?
సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసరు కావాలనుకుంటున్నాను.
ప్ర: ఎంసెట్‌కు ప్రిపేరవుతున్న వారికి మీరిచ్చే సలహా?
అన్నింటికీ అధ్యాపకులపైనే ఆధారపడకుండా సొంతంగా ప్లాన్ చేసుకోవాలి. దాని ప్రకారం చదువు కోవాలి. ఎన్ని చేసిన పరీక్షల్లో రాసినప్పుడు టెన్షన్ లేకుండా కరెక్ట్‌గా రాయడం ముఖ్యం.

Published date : 06 Jul 2012 04:01PM