కార్డియాలజీ డాక్టర్ అవుతా - మెడికల్ స్టేట్ 4వ ర్యాంకర్ కె.నరేష్‌బాబు
Sakshi Education
ప్ర: ఎంసెట్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచినందుకు మీరెలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. 4 ర్యాంకు వస్తుందనుకోలేదు. టాప్ 10లో ఉంటాననుకున్నాను.
ప్ర: మీ కుటుంబ నేపథ్యమేంటి?
మాది వరంగల్. పరకాల దగ్గర పోచారం గ్రామం. నాన్న ఏపీఎస్‌ఆర్టీసీలో అసిస్టెంట్ క్లర్క్. అమ్మ ఇంట్లోనే ఉంటారు. ఇద్దరు అక్కలున్నారు. ప్రస్తుతం హన్మకొండలో ఉంటున్నాం
ప్ర: ఏ మెడికల్ క ళాశాలలో చేరాలనుకుంటున్నారు?
హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరతాను.
ప్ర: మీ అకడమిక్ రికార్డు చెప్పండి?
1నుంచి 10వ తరగతి వరకు థామస్ గ్రామర్ స్కూల్‌లో చదివాను. పదోతరగతిలో 573 మార్కులు వచ్చాయి.
ప్ర: ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలు రాశారా?
ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయలేదు
ప్ర: ఓ వైపు ఇంటర్మీడియెట్ పరీక్షలకు ప్రిపేరవుతూనే ఎంసెట్‌కు ఎలాంటి ప్రిపరేషన్‌ను అనుసరించారు?
కాలేజీలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చదువుకున్నాను. రెండింటికీ ఒకే సారి ప్రిపేర్ అయ్యాను ముందు ఎంసెట్ సిలబస్ పూర్తి చేసి ఇంటర్ పరీక్షలకు చదువుకున్నాను. తర్వాత మళ్లీ ఎంసెట్ సిలబస్‌ను రివిజన్ చేసుకున్నాను. వీకెండ్‌లో పరీక్షలు రాసి వచ్చిన సందేహాలను వెంటనే అధ్యాపకులను అడిగి తెలుసుకున్నాను. మళ్లీ ఆ తప్పులు రాకుండా చూసుకున్నాను
ప్ర: కాలేజీలో బోధన, కోచింగ్ ఎంతవరకు ఉపకరించింది?
కాలేజీలో అధ్యాపకులు చెప్పింది చాలా ఉపయోగపడింది. అందుకే ర్యాంకు సాధించాను.
ప్ర: మీరు ప్రత్యేకంగా ఏవైనా బుక్స్ ప్రిపేరయ్యారా?
కేవలం కాలేజీలో ఇచ్చిన మెటీరియల్. అధ్యాపకులు చెప్పిన నోట్సు తప్ప ఎలాంటి పుస్తకాలు చదవలేదు
ప్ర: అధ్యాపకులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం?
అందరూ చాలా ప్రోత్సహించారు.
ప్ర: భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు?
కార్డియాలజీ డాక్టర్
ప్ర: ఎంసెట్‌కు ప్రిపేరవుతున్న వారికి మీరిచ్చే సలహా?
అధ్యాపకులు చెప్పినట్లు చదవాలి. ఎందుకంటే అనేక మందికి శిక్షణ ఇచ్చి ఉంటారు కాబట్టి ఎలా చదివితే విజయం సాధిస్తారో వారికి తెలుస్తుంది. కచ్చితంగా ఎక్కువ గంటలు కష్టపడి చదవాలి. అప్పడు విజయం వరిస్తుంది.

Published date : 06 Jul 2012 04:19PM