Skip to main content

బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరతా: మెడికల్ స్టేట్ 3వ ర్యాంకర్ బి.వీ.ఆర్.ఎస్. సాయి విరంచి యాదవ్

ప్ర: ఎంసెట్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచినందుకు మీరెలా ఫీలవుతున్నారు?
ఆనందంగా ఉంది. అదే సమయంలో ఉద్వేగంగా కూడా ఉంది. టాప్ 20లో ఉంటానని ఊహించాను. కానీ టాప్ 10లో ఉంటాననుకోలేదు.

ప్ర: మీ కుటుంబ నేపథ్యమేంటి?
మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్స్. నాన్న పీడియాట్రిక్ ఎనస్థీషియన్, అమ్మ గైనకాలజీ సర్జన్.

ప్ర: ఏ మెడికల్ క ళాశాలలో చేరాలనుకుంటున్నారు?
బెనారస్ హిందూ యూనివర్సిటీలో మెడిసిన్‌లో చేరతాను

ప్ర: మీ అకడెమిక్ రికార్డు చెప్పండి?
1 నుంచి 10వ తరగతి వరకు సత్యసాయి హయ్యర్ సెకెండరీ స్కూల్లో చదివాను. పదోతరగతిలో 10 పాయింట్లతో ఏ1 గ్రేడ్ సాధించాను. ఇంటర్ శ్రీ చైతన్య జూనీయర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశా. 983 మార్కులు వచ్చాయి. ఎంసెట్‌లో153 మార్కులొచ్చాయి.

ప్ర: ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలు రాశారా?
బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 3వర్యాంకు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్షలో 78వ ర్యాంకు, మణిపాల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో 38వ ర్యాంకు వచ్చాయి.

ప్ర: ఓ వైపు ఇంటర్మీడియెట్ పరీక్షలకు ప్రిపేరవుతూనే ఎంసెట్‌కు ఎలాంటి ప్రిపరేషన్‌ను అనుసరించారు?
ఇంటర్-ఎంసెట్ రెండింటికీ ప్రిపరేషన్ ఒకేసారి కొనసాగింది. ఇంటర్ సిలబస్‌తోపాటు ఎంసెట్ ప్రిపరేషన్ కొనసాగించా.

ప్ర: కాలేజీలో బోధన, కోచింగ్ ఎంతవరకు ఉపకరించింది?
కాలేజీలో చెప్పింది బాగా ఉపయోగపడింది. నేను మా లెక్చరర్స్ చెప్పింది చదవడం వల్లే మంచి ర్యాంకు వచ్చింది.

ప్ర: మీరు ప్రత్యేకంగా ఏవైనా బుక్స్ ప్రిపేరయ్యారా?
మా కాలేజీలో ఇచ్చిన మెటీరియల్, అధ్యాపకులు చెప్పిన నోట్సు తప్ప అదనంగా ఎలాంటి మెటీరియల్ చదవలేదు

ప్ర: అధ్యాపకులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం?
మా నాన్నగారు బాగా ప్రోత్సహించారు.

ప్ర: భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు?
కార్డియాలజీ డాక్టర్

ప్ర: ఎంసెట్‌కు ప్రిపేరవుతున్న వారికి మీరిచ్చే సలహా?
పద్ధతి ప్రకారం చదవాలి. ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా దాన్ని అమలు చేయాలి. హార్డ్‌వర్క్ చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా చదువుతున్నప్పుడు ఏకాగ్రత తప్పనిసరిగా ఉండాలి.
Published date : 06 Jul 2012 03:54PM

Photo Stories