ఐఏఎస్.. నా జీవిత లక్ష్యం
Sakshi Education
- 466 మార్కులతో ఎంపీసీ స్టేట్ టాపర్‌గా నిలిచిన అఖిలతో సాక్షి ఇంటర్వ్యూ...
పెద్దయ్యాక ఐఏఎస్ అధికారి కావాలనేదే నా కల. ఇంట్లో కుటుంబ సభ్యులు నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకుంటున్నారు. ప్లస్ టూ అయ్యాక ఐఐటీలో చేరి ఆ తర్వాత సివిల్స్ రాయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కాలేజీలో ఇంటర్ పరీక్షలకు ముందు నుంచే ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేయడంతో టాపర్‌గా నిలుస్తానని ముందే అనుకున్నా. దానికి తగ్గట్టుగానే స్టేట్ టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎవరైనాసరే ఇష్టపడి చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఆఘాల అఖిల. శుక్రవారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 466 మార్కులతో ఎంపీసీ విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచిన ఈమెతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ..
స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఊహించారా?
స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తుందని ముందే అనుకున్నా. ఎందుకంటే.. పరీక్షలకు రెండు నెలల ముందు నుంచే కాలేజీలో ప్రత్యేక ప్రిపరేషన్ ప్రక్రియ మొదలుపెట్టించారు. ప్రధానంగా ర్యాపిడ్ ఫైర్ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మాలో ఉత్సాహాన్ని, పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదలను పెంచారు. దాంతో తదేక దీక్షతో చదివాం. చివరకు ఆ కష్టం ఫలితాల రూపంలో రావడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా ఉన్నారు.
ఫ్యామిలీ, విద్యా నేపథ్యం?
మాది విశాఖజిల్లా మాధవదార. నాన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలోని ఉన్నతోద్యోగి. దాంతో నా మూడో తరగతిలోనే కాకినాడకు వచ్చేశాం. పదోతరగతి అక్షర స్కూల్లో చదివాను. సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదవడంతో ఏ1 గ్రేడ్ వచ్చింది. అమ్మ గృహిణి.
మొత్తం మార్కులు?
నా హాల్ టిక్కెట్ నెంబర్ 1203117787.
అసలు పరీక్షలకు ముందు ఏ సబ్జెక్టు ఎలా చదవాలి? అనే సందేహం ఉండేది. దీన్ని మా కాలేజీలో టీచర్లు నివతి చేశారు. అసలు ఎలా చదవాలి? అనేదానిపై దగ్గరుండి చదివించారు. వాస్తవానికి చాలామంది విద్యార్థులు తమకు ఇంగ్లిష్ సబ్జెక్టు కష్టంగా ఉందనుకుంటారు. వాస్తవానికి ఇంగ్లిష్ ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి వీలున్న సబ్జెక్టు. అందుకే ఇంగ్లిష్ ఇష్టంగా భావించి ప్రిపరేషన్ మొదలుపెట్టా. అదేవిధంగా మ్యాథ్స్ కూడా నూటికినూరు మార్కులు తెచ్చుకోవడానికి వీలున్న సబ్జెక్టు. అందుకే ఒకటికిరెండుసార్లు ఈ సబ్జెక్టును బాగా రివిజన్ చేశా. అదేవిధంగా సమీకరణాలు, ఇతర సూత్రాల విషయంలో మార్కులు కోల్పోకుండా ఉండేందుకు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేశా.
జీవిత లక్ష్యం?
ఇంటర్ పూర్తయ్యాక ఐఐటీలో చేరాలనేది నా మొదటికల. నాన్న ఇంజనీరింగ్‌లో ఈసీఈ చేశారు. దాంతో నన్ను కూడా ఇంజనీర్‌గా చూడాలని అమ్మానాన్న ఆశిస్తున్నారు. అందుకే వారి ఆశయం నెరవేర్చడానికి ఏదైనా పేరొందిన ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేస్తా. నా అంతిమ లక్ష్యం మాత్రం పేదలకు సాయం చేయడమే. అందుకే ఐఐటీ పూర్తయిన తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారి కావాలనుకుంటున్నా.
ఎక్కువ మార్కులు సాధించాలంటే?
కష్టపడి చదివితే ఎవరైనా టాపర్‌గా నిలుస్తారు. టాప్ ర్యాంకు సాధించినవాళ్లు గొప్పవాళ్లేంకాదు. కాకపోతే చదివే సబ్జెక్టును ఇష్టంగా స్వీకరించి దానికి అనుగుణంగా ప్రణాళికబద్ధంగా చదవాలి. అప్పుడే విజయం సాధించడం సాధ్యమవుతుంది.
హాబీలు?
పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఖాళీ దొరికిందంటే నేను చేసే మొదటి పని అదే.

- సంస్కతం 99
- ఇంగ్లిష్ 97
- మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ 75
- సెకండ్ పేపర్ 75
- ఫిజిక్స్ 60
- కెమిస్ట్రీ 60

Published date : 20 Apr 2012 06:37PM