Skip to main content

AP MBBS & BDS Admissions: AP MBBS & BDS Admissions: నేటి నుంచి ఎంబీబీఎస్ & బీడీఎస్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

AP MBBS & BDS Admissions  Notification for MBBS and BDS admissions in Amaravati Health University  Online application period for MBBS and BDS courses at Health University  Important dates for medical and dental college admissions in Andhra Pradesh  నేటి నుంచి  ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు  ఆన్‌లైన్‌ దరఖాస్తులు
AP MBBS & BDS Admissions: నేటి నుంచి ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో కన్వినర్‌ కోటా ప్రవేశాల కోసం విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 16 సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.                                               https://apuhs-ugadmissions.aptonline.in/MBBS లో దరఖా­స్తులు సమర్పించాలి. 

ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2,950, ఎస్సీ, ఎస్టీలు రూ.2,360 దరఖాస్తు రుసుం చెల్లించాలి. నియమ, నిబంధనలకు సంబంధించి సందేహాల నివృత్తికి 8978780501, 7997710168 నంబర్లను, రుసుం చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలకు 9000780707 నంబర్‌ను సంప్రదించాలని వర్సిటీ రిజి్రస్టార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితాను విశ్వవిద్యాలయం రూపొందిస్తుంది. 

తుది మెరిట్‌ జాబితా ప్రకటించాక కన్వినర్‌ కోటాలో అన్ని దశలకు కలిపి ఒకేసారి వెబ్‌ఆప్షన్‌ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం వివిధ దశలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ ఏడాది రాష్ట్రం నుంచి 43,788 మంది నీట్‌ యూజీ–2024లో అర్హత సాధించారు.    

ఉస్మానియా కోటా రద్దు 
జీవో 513 ప్రకారం.. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కోటాను రద్దు చేసినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరం వరకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), ఓయూ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) విద్యార్థులకు 42:36:22 నిష్పత్తిలో ఎంబీబీఎస్‌ సీట్లను కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది నుంచి 36 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఏపీ విద్యార్థులకే కేటాయించనున్నారు. మెరిట్‌ ఆధారంగా ఏయూ, ఎస్వీయూ విద్యార్థులతో సీట్లను భర్తీ చేయనున్నారు.    

అప్‌లోడ్‌ చేయాల్సిన ధ్రువపత్రాలు 
4 నీట్‌ యూజీ– 2024 ర్యాంక్‌ కార్డ్‌  4 పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో) 4 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 4 ఇంటర్మిడియెట్‌ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు 4 విద్యార్థి తాజా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, సంతకం 4 ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (ఇంటర్‌/10+2)  4 కుల ధ్రువీకరణ  4  ఆధార్‌ కార్డు 4  దివ్యాంగ ధ్రువీకరణ పత్రం

Medical

Published date : 12 Aug 2024 08:14AM

Photo Stories