Skip to main content

NEET PG: సీట్ల భర్తీ కేసు.. సుప్రీం తీర్పు..

NEET PG 2021–22లో అఖిల భారత కోటాలోని సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది.
NEET PG
సీట్ల భర్తీ కేసు.. సుప్రీం తీర్పు..

విద్య, వైద్యం విషయంలో రాజీ పడి, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా ఉండొద్దని ప్రభుత్వానికి సూచించింది. పలుమార్లు కౌన్సిలింగ్‌ నిర్వహించినా NEET PGలో 1,456 సీట్లను ఇంకా భర్తీ చేయలేదని, మరో రౌండ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనురుద్ధ బోస్‌తో కూడిన Supreme Court Vacation Benche జూన్‌ 9న విచారణ కొనసాగింది. 8–9 సార్లు కౌన్సిలింగ్‌ నిర్వహించినా ఇంకా సీట్లు భర్తీ కాకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రత్యేక కౌన్సిలింగ్‌లకు కూడా ఒక పరిమితి ఉండాలని హితవు పలికింది. మూడేళ్ల కోర్సులో ఏడాదిన్నర తర్వాత ప్రవేశాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. పిటిషన్లను అవరోధాలు కల్పించే లిటిగేషన్లుగా చూడొద్దని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బల్బీర్‌సింగ్‌కు సూచించింది. దేశంలో ఇప్పటికే వైద్యుల కొరత తీవ్రంగా ఉందని గుర్తుచేసింది. పీజీ చేసిన డాక్టర్లు, స్పెషాలిటీ డాక్టర్లు ప్రభుత్వానికి అవసరమని Supreme Court Vacation Benche పేర్కొంది. తీర్పును జూన్‌ 10కి వాయిదా వేసింది. 

చదవండి: 

Published date : 10 Jun 2022 05:04PM

Photo Stories