Ayodhya Airport Name Changes-అయోధ్య ఎయిర్‌పోర్టుకు పేరు మార్పు,విమాన సర్వీసులు ఎప్పటినుంచంటే..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి "మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్"గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
అప్పుడు అలా..ఇప్పుడిలా
ఇంతకుముందు ఈ విమానాశ్రయాన్ని ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమనాశ్రాయం’గా పిలిచేవారు.జనవరి 22న అయోధ్య రామాలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముందే ఈ ఎయిర్‌పోర్టులో సేవలు ప్రారంభం అయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే తమ సేవలను ప్రారంభించింది.
విమాన సర్వీసులు అప్పట్నుంచి ప్రారంభం
ఈ రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. ఈరోజు(జనవరి6)నుంచి రెగ్యులర్ విమానాలను నడుపుతారు.ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్ నుంచి ఇక్కడకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేశారు.
కాగా దాదాపు రూ.1450 కోట్లతో ఎయిర్‌పోర్టును నిర్మించారు. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. పీక్-అవర్‌లో 600 మంది ప్రయాణికులకు వసతులు అందించగలిగేలా నిర్మించారు.