Skip to main content

AP Govt Jobs: ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నెల‌కు రూ.80,910 వ‌ర‌కు జీతం.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
YSRUHS Vijayawada Recruitment 2024 Notification

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. సీబీటీ విధానంలో ప‌రీక్ష‌ ఉంటుంది. స్క్రీనింగ్ ప‌రీక్ష‌ 150 మార్కులకు ఉంటుంది. ఇక మెయిన్స్ ప‌రీక్ష‌లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. మొత్తం 300 మార్కులకు మెయిన్స్ ఉంటుంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 20

అర్హత: కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.25,220 నుంచి రూ.80,910.

Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులు/దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500.
 
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 12-01-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 01-02-2024

వెబ్‌సైట్‌: http://drysruhs.edu.in/

Published date : 17 Jan 2024 06:32PM

Photo Stories