Skip to main content

India Post Recruitment 2023 : తపాలా శాఖలో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
40,889 Rural Dak Sevak Posts in Postal Department

మొత్తం పోస్టుల సంఖ్య: 40,889
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–2480, తెలంగాణ–1266.
పోస్టులు: గ్రామీణ డాక్‌ సేవక్స్‌–బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌.
సర్కిల్‌ వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–2480, అసోం–407, బీహార్‌–1461, ఛత్తీస్‌గఢ్‌–1593, ఢిల్లీ–46, గుజరాత్‌–2017, హర్యానా–354, హిమాచల్‌ ప్రదేశ్‌–603, జమ్మూ–కశ్మీర్‌–300, జార్ఖండ్‌–1590, కర్ణాటక–3036, కేరళ–2462, మధ్యప్రదేశ్‌–1841, మహారాష్ట్ర–2508, నార్త్‌ ఈస్టర్న్‌–923, ఒడిశా–1382, పంజాబ్‌–766, రాజస్థాన్‌–1684, తమిళనాడు–3167, తెలంగాణ–1266, ఉత్తరప్రదేశ్‌–7987, ఉత్తరాఖండ్‌–889, పశ్చిమ బెంగాల్‌–2127.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.
వయసు: 16.02.2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380, ఏబీపీఎం/డాక్‌ సేవక్‌ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సా«ధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు జరుగుతాయి. ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్‌/ఈమెయిల్‌/పోస్టు ద్వారా అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
దరఖాస్తు సవరణ ప్రారంభతేది:17.02.2023
దరఖాస్తు సవరణ చివరితేది: 19.02.2023.
వెబ్‌సైట్‌: www.indiapostgdsonline.gov.in

Qualification 10TH
Last Date February 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories