Job Opportunity: గిరిజన మహిళలకు ఉద్యోగావకాశం..

సాక్షి ఎడ్యుకేషన్: గిరిజన మహిళలు ఈ నెల 6న చింతపల్లి యువకుల శిక్షణ కేంద్రం(వైటీసీ)లో నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఐ పి.వెంకటరమణ కోరారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ నిర్వహిస్తున్న సంస్థలో మూడు వేల వరకు ఉద్యోగాలు ఉన్నాయన్నారు.
ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు. ఎంపికైన మహిళలకు కర్నాటక రాష్ట్రంలో హొసూర్‌లో ఉపాధి శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నెలకు రూ.20 వేలతో ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440904218, 9440904241, 9440904217 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
MLHP Counselling: ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్..
యువతకు అవగాహన
కొయ్యూరు సంతలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతీ యువకులకు మంప ఎస్‌ఐ లోకేష్‌కుమార్ ఆదివారం పోలీసు శాఖ ప్రేరణ కార్యక్రమం ద్వారా కల్పిస్తున్న ఉద్యోగాల ప్రాధాన్యతను వివరించారు. ఇందులో భాగంగా చింతపల్లిలో ఈనెల 6వ తేదీన నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు అర్హులైన యువతులు తరలివెళ్లాలని సూచించారు. ఆటోలో విస్తృత ప్రచారం చేశారు.