Skip to main content

JEE Mains 2024 Session 1 Key: ప్రాథమిక కీ విడుదల... ఆన్సర్ కీ ఛాలెంజ్ కి చివరి తేదీ ఇదే !

JEE మెయిన్ 2024 సెషన్ 1 పరీక్షలు జనవరి 24, 27, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1, 2024 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఈ రోజు తాత్కాలిక కీ విడుదల చేయబడింది. ఇక్కడ డైరెక్ట్ లింక్‌ చూడండి
JEE Main 2024   Remarkable Increase in JEE Main Candidates  JEE Mains Session 1 Result Release Date 2024   Record JEE Main Applications

జాతీయ పరీక్షా సంస్థ (NTA) జాయింట్ ఎంట్రన్స్ పరీక్ష (మెయిన్) - 2024 సెషన్ 1 ను 24 జనవరి 2024 (పేపర్ 2A: B.Arch. & పేపర్ 2B: B.Planning) మరియు 27, 29, 30, 31 జనవరి 2024 మరియు 01 ఫిబ్రవరి 2024 (పేపర్ 1: B.E./B.Tech.) 291 నగరాల్లో (21 నగరాలతో సహా) భారతదేశం వెలుపల) 544 కేంద్రాలలో.

పేపర్ 1 (B.E./B.Tech.), పేపర్ 2A (B.Arch.) మరియు పేపర్ 2B (B. ప్లానింగ్) యొక్క తాత్కాలిక సమాధానాల కీలు, రికార్డెడ్ రెస్పాన్స్‌లతో కూడిన ప్రశ్న పత్రాలతో పాటు https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి.

ఆసక్తి గల అభ్యర్థులు సవాలు చేయబడిన ప్రతి ప్రశ్నకు ₹ 200/- (రూ. రెండు వందలు మాత్రమే) తిరిగి చెల్లించలేని ప్రాసెసింగ్ రుసుమును చెల్లించడం ద్వారా తాత్కాలిక సమాధాన కీలకు (ఏదైనా ఉంటే) ఆన్‌లైన్‌లో సవాలును సమర్పించవచ్చు. 

ఆన్సర్ కీ ఛాలెంజ్ వ్యవధి: 06 ఫిబ్రవరి నుండి 08 ఫిబ్రవరి 2024 వరకు (రాత్రి 11:00 వరకు).

ముఖ్య గమనికలు:

  • అభ్యర్థి చేసిన ఛాలెంజ్(లు) సరైనదని తేలితే, ఆన్సర్ కీ సవరించబడుతుంది మరియు తదనుగుణంగా అభ్యర్థులందరి ప్రతిస్పందనలో వర్తించబడుతుంది.
  • సవరించిన ఫైనల్ ఆన్సర్ కీల ఆధారంగా, ఫలితాన్ని సిద్ధం చేసి ప్రకటిస్తారు.
  • ఏ ఒక్క అభ్యర్థికి అతని/ఆమె సవాలు యొక్క అంగీకారం/నిరాకరణ గురించి తెలియజేయబడదు.
  • ఛాలెంజ్‌ని పరిష్కరించిన తర్వాత నిపుణులు ఖరారు చేసిన కీలు ఫైనల్ అవుతాయి.

How to check JEE Main 2024 Session-1 answer key. 

  • Visit the official website jeemain.nta.ac.in
  • On the homepage, click on JEE main answer key 2024 link.
  • Submit the login credentials.
  • JEE Main 2024 session 1 answer key will appear
  • View and download the key.

➤ IIT and NIT Seats Increase 2024 : ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పెరిగే అవ‌కాశం ఇలా..! అలాగే కటాఫ్ కూడా మార్పు..?

12,31,874 మంది దరఖాస్తులు.. హాజ‌రు శాతం కూడా..

చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి రికార్డు స్థాయిలో జేఈఈ మెయిన్‌కు ఈ సారి ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.. అలాగే హాజ‌రు శాతం కూడా భారీగానే ఉంది. దీంతో ఈ సారి పోటీ తీవ్ర‌త కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్‌ పేపర్‌–1 (బీఈ/బీటెక్‌) పరీక్ష 95.80 శాతం, పేపర్‌–2 (బీఆర్క్‌/బీప్లానింగ్‌) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం.

చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్‌కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్‌ జెండర్‌ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్‌–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. జేఈఈ మెయిన్ మొద‌టి సెషన్ ఫ‌లితాలను 2024, ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ విడుద‌ల చేయ‌నున్నారు. జేఈఈ మెయిన్ మొద‌టి సెషన్ 2024 ప్రాథ‌మిక కీ ని  ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఈ కీ పై అభ్యంత‌రాలు కూడా తీసుకోనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ మొద‌టి సెషన్ 2024 ఫైన‌ల్‌ 'కీ' కూడా ఫ‌లితాల‌తో పాటు విడుద‌ల చేస్తారు.

చదవండి: JEE Success Tips : జేఈఈ మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌ రాసే విద్యార్థుల‌కు నా స‌ల‌హా ఇదే..

ఈ ఏడాది తొలిసారిగా..
జేఈఈ మెయిన్‌కు 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్‌ సిటీ, కౌలాలంపూర్, లాగోస్‌/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్‌లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్‌ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహించారు.

జేఈఈ మెయిన్ రెండో సెషన్‌ తేదీల్లో మార్పు ఇలా..

jeejee mains 2nd session 2024 exam date

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్‌–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్‌లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్‌టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్‌ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్‌ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు.

How to Check JEE Main 2024 Session 1 Results :

☛ Go to jeemain.nta.nic.in 2024, the official JEE Main result website.

☛ Select the option to “View score card” or View JEE Main 2024 result.

☛ Put your birthdate and application number in here.

☛ Now, click Submit.

☛ The complete NTA JEE Main result will show on the screen, along with the scores.

☛ The JEE result page should be printed out and saved for future use.

☛ The JEE Main 2024 Scorecard will no longer be accessible after July 31, 2024, hence applicants need to save a copy of it.

Published date : 08 Feb 2024 07:46AM

Photo Stories