Skip to main content

Jobs: ప‌ది, ఇంట‌ర్‌, ఐటీఐ అర్హ‌తతో బార్క్‌లో భారీగా ఉద్యోగాలు...వేత‌నం ఎంతంటే

ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం…డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ ట్రైనింగ్ స్కీం ద్వారా డీఏఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 24 నుంచి మే 22 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
BARC Recruitment 2023
BARC Recruitment 2023

ఖాళీల వివరాలు:
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్:
టెక్నికల్ ఆఫీసర్/ సి: 181 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్/ బి: 7 పోస్టులు
టెక్నీషియన్/ బి: 24 పోస్టులు
ప్రారంభ వేతనం: నెలకు టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలకు రూ.56,100; సైంటిఫిక్ అసిస్టెంట్ కు రూ.35,400; టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 చెల్లిస్తారు.

barc


స్టైపెండరీ ట్రైనీ:
కేటగిరీ-1: 1216 పోస్టులు
కేటగిరీ-2: 2946 పోస్టులు
స్టైపెండ్: నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000;
కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 
విభాగాలు: బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ 
అర్హత: పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయోపరిమితి (22.5.2023 నాటికి): 
టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35 
సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30 
టెక్నీషియన్‌కు 18-25
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24 
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

barc


దరఖాస్తు ఫీజు: 
టెక్నికల్ ఆఫీసర్ - రూ.500 
సైంటిఫిక్ అసిస్టెంట్‌ - రూ.150
టెక్నీషియన్ - రూ.100
కేటగిరీ-1కు రూ.150
కేటగిరీ-2కు రూ.100
ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 24-04-2023.
చివరి తేదీ: 22-05-2023.
వెబ్‌సైట్‌: https://www.barc.gov.in/

ఈ 4,374 ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 24 Apr 2023 01:02PM
PDF

Photo Stories