Skip to main content

Assistant Professors Recruitment: వైద్య ఆరోగ్య శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ వైద్య ఆరోగ్యశాఖలో మరో నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.
AP DME Assistant Professors Recruitment 2024  Job Opportunity   424 Posts Notification  Medical Education Department Updates     Andhra Pradesh Medical Colleges Notification

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి జ‌న‌వ‌రి 30వ తేదీ (మంగళవారం) నోటిఫికేషన్ విడుదల చేసింది మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు. 

IIT Recruitment: ఐఐటీ తిరుపతిలో టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్న‌ట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ‘సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశాం. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6వ తేదీ ఓల్డ్ జీజీహెచ్, హనుమాన్ పేట, విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ ఇన్‌ రిక్రూట్మెంట్ జరగనుంద’ని ఆయన తెలిపారు. 

అలాగే.. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదంటే.. http://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లను పరిశీలించాలని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కోరుతోంది.

RRB ALP Age Limit 2024: ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి పెంపు.. ఎన్ని సంవ‌త్స‌రాలు అంటే..!

Published date : 30 Jan 2024 06:06PM

Photo Stories