RRB ALP Age Limit 2024: ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు.. ఎన్ని సంవత్సరాలు అంటే..!
Sakshi Education
భారతీయ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

ఇటీవల రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొదట 01-07-2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులని తెలిపింది. తాజాగా కరోనా కారణంగా వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
Published date : 30 Jan 2024 01:03PM