Skip to main content

Telangana Police Events: గర్భిణీ పోలీసు అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.... నేరుగా మెయిన్స్‌కు

పోలీస్‌ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో గర్భవతులు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఫిజికల్‌ ఈవెంట్స్‌ నుంచి ప్రస్తుతానికి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
Police Events

ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాకుండా నేరుగా తుది రాత పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంటుంది. అయితే వారంతా తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల లోపు ఫిజికల్‌ ఈవెంట్స్‌లో పాల్గొని అర్హత సాధిస్తామంటూ.. టీఎస్‌ఎల్పీఆర్బీకి రాత పూర్వకంగా అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వని వారిని తుది పరీక్షకు అనుమతించరు.

చ‌ద‌వండి: మహిళలకు బంపరాఫర్‌... పిలిచి మరీ ఉద్యోగాలు
దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన వెంటనే తుది రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే ఫిజికల్‌ ఈవెంట్స్‌ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు. 

చ‌ద‌వండి: పాలిటెక్నిక్‌ మధ్యలో మానేసినా... ఇంటర్‌లో చేరొచ్చు
ఫిజికల్‌ ఈవెంట్స్‌లో ఇప్పటివరకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో 54 శాతం మంది వాటిని విజయవంతంగా పూర్తి చేసినట్లు బోర్డు పేర్కొంది. గత రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా నిర్వహించిన ఫిజికల్‌ ఈవెంట్స్‌లో 52 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. 

చ‌ద‌వండి: 12 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయి... కష్టాలను దాటుకుంటూ... పోస్ట్‌మాస్టర్‌గా
గతంతో పోలిస్తే ఫిజికల్‌ ఈవెంట్స్‌ను మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణం. గతంలో పురుషులకు ఐదు ఫిజికల్‌ ఈవెంట్స్, మహిళలకు మూడు ఉండగా..ఈసారి అందరికీ మూడు (రన్నింగ్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్‌)మాత్రమే ఉన్నాయి. గతంలో పురుషులకు ఛాతీ కొలతలను సైతం తీసేవారు. ఈసారి కేవలం ఎత్తు కొలత డిజిటల్‌ మీటర్ల ద్వారా తీస్తున్నారు.
డిసెంబర్‌ 8 నుంచి అభ్యర్థులకు ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఈవెంట్స్‌ పూర్తి కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్ల గొండ, సిద్దిపేటల్లో ఇంకా కొనసాగుతోంది.

Published date : 28 Dec 2022 04:18PM

Photo Stories