ఈ ఉద్యోగాలకు.. లక్ష మంది మహిళల దరఖాస్తు
4.5 లక్షల దరఖాస్తుల్లో 2.5 లక్షల మంది వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 23 శాతం అంటే ఒక లక్ష మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పురుషులు 77 శాతం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 6 శాతం ఓపెన్ కేటగిరీ, 53 శాతం బీసీ, 22 శాతం ఎస్సీ, 19 శాతం ఎస్టీ అభ్యర్థులున్నట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు మూడు వంతుల్లో దాదాపు రెండు వంతుల మంది పరీక్ష మాధ్యమం తెలుగు మీడియం ఎంచుకున్నారని, ఒక వంతు ఇంగ్లిష్ మీడియం, 0.2 శాతం ఉర్దూ మాధ్యమం ఎంచుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు మరో వారం మాత్రమే సమయం ఉన్నందున అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేయడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదముందని అప్రమత్తం చేశారు. కాగా, ఉద్యోగాల దరఖాస్తుకు మే 20 రాత్రి 10 గంటల వరకు సమయం ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి:
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!
TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..