High Court: డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఫలితాలు వెల్లడించండి
కొత్తగా డ్రైవింగ్ పరీక్షకు హాజరైన వారి ఫలితాలు కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది. నిరంతరాయంగా రెండేళ్ల హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ లేదని, కొందరు ఇప్పుడే డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యారని.. పేర్కొంటూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పలువురి ఫలితాలను నిలిపివేసింది. దీన్ని సవాల్ చేస్తూ సంబంధిత అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరపున న్యాయవాది రమేశ్ చిల్లా వాదనలు వినిపించారు. మోటార్ వెహికల్ చట్టానికి 2019లో చేసిన సవరణ మేరకు లైసెన్స్ పూర్తయిన తర్వాత ఏడాదిలోపు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలా రెన్యువల్ చేసుకున్న వారు నిరంతరాయంగా లైసెన్స్ కలిగి ఉన్నట్లేనని చట్టం చెబుతోందని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. చట్టప్రకారం లైసెన్స్ కలిగిన పిటిషనర్ల పరీక్ష ఫలితాలను వెల్లడించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది.
చదవండి: TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారా..? అయితే ఈ తప్పులు చేయకండి..