Skip to main content

TS Police Jobs: పోలీస్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా..? అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి..

తెలంగాణలో 17 వేల పైచిలుకు పోలీసు ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌ చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే స‌మ‌యంలో తీసుకోవాల్సిన‌ జాగ్ర‌త్త‌లను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కింది విధంగా సూచించింది.
ts police jobs apply online 2022
TS Police Jobs Apply Online 2022 Instructions

☛ పోలీసు ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తును నమోదు చేసే సమయంలో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూసుకోవాలని వివరించింది. ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత మార్పులు చేసుకోవడం సాధ్యం కాదని, ఎడిట్ ఆప్షన్ ఉండదని బోర్డ్ స్పష్టం చేసింది. అప్లికేషన్ ఫామ్‌లో నమోదు చేసుకున్న వివరాలన్నింటినీ సరి చూసుకున్న తర్వాతనే సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలని బోర్డ్ సూచించింది. దరఖాస్తుల్లో చేసిన తప్పులకు అభ్యర్థులే బాధ్యత వహించాలని బోర్డ్ తెలిపింది.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

☛ ఫోన్ల ద్వారా అస్సలు ద‌ర‌ఖాస్తు చేయొద్దని బోర్డ్ స్పష్టం చేసింది. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. దరఖాస్తు చేసుకునే అన్ని పోస్టులకూ ఒకే ఫోన్ నంబర్ ఇవ్వాలని బోర్డు సూచించింది. దరఖాస్తు చేసే సమయంలో వేర్వేరు పోస్టులకు వేర్వేరు ఫోన్ నంబర్లు ఇవ్వొద్దని బోర్డు స్పష్టం చేసింది. 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించనున్నట్లు బోర్డు తెలిపింది.

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

☛ కేవలం 5 శాతం ఖాళీలను మాత్రమే నాన్‌లోకల్‌ కేటగిరిలో ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు అర్హత ఉంటుందని బోర్డు తెలిపింది. ఇంకా అన్ని ఖాళీలకు ఒకే సారి దరఖాస్తు చేసుకోవాలనే నియ‌మం ఏమీ లేదని బోర్డు తెలిపింది. అభ్యర్థులు చివ‌రి తేదీ వరకు ఎప్పుడైనా ఏ పోస్టుకైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. అయితే ఒకే యూజర్‌ ఐడీలో అన్ని పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని సూచించింది బోర్డు వెల్లడించింది.

TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

☛ ఆదివాసీ అభ్యర్థులకు ఎత్తు 160 సెంటీ మీటర్లు ఉంటే సరిపోతుందని.. వారికి మినహాయింపు ఉంటుందని బోర్డు వెల్లడించింది. ఇతర వర్గాల అభ్యర్థులు 167.6 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలని బోర్డు వివరించింది. వయో సడలింపుపై బోర్డు స్పష్టత ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు వయోసడలింపు వర్తించదని బోర్డు తెలిపింది.

☛ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల‌కు మాత్రమే వారి సర్వీసు ఆధారంగా 5 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుందని బోర్డు వివరించింది. ఇంకా ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, ఆర్టీసీ ఉద్యోగులకు వయోసడలింపు వర్తించదని బోర్డు వివరించింది. ఇంకా ఏదైనా కేసులో కోర్టులు దోషులుగా తేల్చిన అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని బోర్డు స్పష్టం చేసింది.

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

☛ దరఖాస్తు సమయంలో తప్పుడు వివరాల‌ను నమోదు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా వారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఇంకా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు  వెల్లడించింది.

☛ మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ, దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్ లో సత్తా చాటిన అభ్యర్థులకు ఉద్యోగం లభిస్తుంది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

☛ పూర్తి వివ‌రాల‌కు అధికారిక వెబ్‌సైట్ : https://www.tslprb.in ను సందర్శించాలని సూచించారు.

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

​​​​​​​TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయ్‌.. జాగ్రత్తగా రాయండిలా..

మూడేళ్ల వయోపరిమితి సడలింపు 
పోలీస్, తదితర విభాగాల్లో పోస్టులకు వయోపరిమితిని మూడేళ్ల పాటు సడలించింది. పోలీస్‌ శాఖ, ఇతర యూనిఫాం విభాగాల్లో.. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు 21 ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే అర్హులు. ఇప్పుడు 28 ఏళ్ల వరకు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్‌ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు పరిమితి ఉండగా.. ఇప్పుడు 25 ఏళ్ల వయసున్న వారి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న (కార్పొరేషన్లు కాకుండా) వారికి ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మరో మూడేళ్లు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్చర్లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల వారికి ఐదేళ్లు, జనగణన శాఖలో తాత్కాలిక పద్ధితిలో ఆరు నెలలల పాటు 1991లో పనిచేసిన వారికి మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉన్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో తెలిపింది.

TS Police Jobs: ద‌ర‌ఖాస్తు నుంచి తుది రాతపరీక్ష వరకు.. ఏవేవి ఎప్పుడంటే..?

Published date : 12 May 2022 05:38PM

Photo Stories