Skip to main content

Women Empowerment: మహిళలకు బంపరాఫర్‌... పిలిచి మరీ ఉద్యోగాలు

సమాజంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత మేరకు ఉద్యోగావకాశాల్లో ఉండడం లేదు. అన్నింట్లోనూ పురుషాధిక్యమే నడుస్తోంది. కొన్ని కొన్ని చోట్ల మహిళలు తమ సత్తా చాటుతున్నా అధికశాతం అవకాశాలు మాత్రం పురుషులకే దక్కుతున్నాయి. వీటిని కారణాలు అనేకం.
women

కానీ, ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలు లేడీస్‌ ఫస్ట్‌ అంటున్నాయి. ఏ మాత్రం నైపుణ్యం ఉన్నా వారికి పిలిచి మరీ ఉద్యోగాలిస్తున్నాయి. 

కార్పొరేట్‌ సంస్థలు మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాయి. కాగ్నిజంట్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, కేపీఎంజీ, యాక్సిస్‌ బ్యాంకు, ష్నీడర్‌ ఎలక్ట్రిక్, సిప్లా, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ తదితర ఎన్నో సంస్థలు తమ ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల నిష్పత్తి మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండగా, మరింత పెంచాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చర్యలను కొన్ని సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. 

సౌకర్యవంతంగా పనిచేసే ఏర్పాట్లు చేయడం, ట్రైనీలుగా, ఫ్రెషర్లుగా క్యాంపస్‌ల నుంచి తీసుకోవడం, సీనియర్‌ స్థాయిలో మార్గదర్శకులుగా నియమించుకోవడం, టీమ్‌ లీడ్‌ బాధ్యతల్లోకి మహిళలను తీసుకోవడం వంటివి సంస్థలు అమలు చేస్తున్నాయి. సెకండర్‌ కెరీర్‌ (విరామం తర్వాత మళ్లీ చేరడం) మహిలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నాయి.  

చ‌ద‌వండి: పాలిటెక్నిక్‌ మధ్యలో మానేసినా... ఇంటర్‌లో చేరొచ్చు

ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల పరంగా మంచి వైవిధ్యం ఉంటే మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. వైవిధ్యంతో కూడిన బృందం ఇతరులతో పోలిస్తే ఎంతో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మంచి నైపుణ్యం కలిగిన మహిళా ఉద్యోగులను కోల్పోవద్దనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. 

చ‌ద‌వండి: 12 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయి... కష్టాలను దాటుకుంటూ... పోస్ట్‌మాస్టర్‌గా

ఐటీసీ అయితే మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. చంటి పిల్లలు ఉన్న ఉద్యోగినులకు సంరక్షకుల సేవలు, ప్రత్యేక రవాణా వసతులను సైతం సమకూరుస్తోంది. యాక్సిస్‌ బ్యాంకు అయితే ప్రత్యామ్నాయ పని నమూనాలతో నైపుణ్యాలు కలిగిన మహిళలను ఆకర్షిస్తోంది. ‘గిగ్‌ఏ’ అవకాశాల పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం కింద 44 శాతం అధికంగా మహిళలను నియమించుకుంది. 

చ‌ద‌వండి: అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా...

ఎల్‌అండ్‌టీ మహిళల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోంది. ఎవరైనా వేరే పట్టణానికి బదిలీ చేయాలని కోరితే, సాధ్యమైన మేర వారు కోరిన ప్రాంతంలో సర్దుబాటుకు ప్రయత్నిస్తోంది. వైవిధ్యమైన మానవ వనరులతో పోటీతత్వం పెరుగుతుందని ఐటీసీ భావిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లింగ నిష్పత్తి ప్రస్తుతం 23.3 శాతంగా ఉంది. అంటే ప్రతి 100 మందికి 23 మంది మహిళా ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. 

క్యాంపస్‌ నియామకాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్నే... సెకండ్‌ కెరీర్‌ మహిళల విషయంలోనూ కంపెనీలు చూపిస్తుండడంతో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. అలాగే గతంలో తమ కంపెనీల్లో పని చేసి వెళ్లిన వారికి కూడా రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నాయి వివిధ కంపెనీలు. సో అవసరమైన నైపుణ్యాలు ఉంటే మహిళల కెరీర్‌ ఎలాంటి ఢోకా లేకుండా సాగుతుందనడానికి ఇవే నిదర్శనాలు.

Published date : 28 Dec 2022 03:30PM

Photo Stories