SBI: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 6,160 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే అభ్యర్థులు ఏదైన ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటిస్: 6,160 ఖాళీలు
ఎస్సీ- 989
ఎస్టీ- 514
ఓబీసీ- 1389
ఈడబ్ల్యూఎస్- 603
అన్ రిజర్వ్‌డ్ - 2665
చదవండి: జమిలి ఎన్నికల దిశగా ఒడిఒడిగా అడుగులు... జమిలి ఎన్నికలు సాకారమయ్యేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో 390 ఖాళీలు; తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. నెలకు రూ.15 వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.
అభ్యర్థుల వయసు 01.08.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
చదవండి: చదువుల్లో రారాజులు... చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తల విద్యార్హతలు ఇవే..!
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: సెప్టెంబర్ 1 నుంచి 21వ తేదీ వరకు.
ఆన్‌లైన్ పరీక్ష: అక్టోబర్/ నవంబర్ 2023.