Skip to main content

Backlog Jobs: బ్యాక్‌లాగ్ అభ్య‌ర్థుల‌ మెరిట్ జాబితా

బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నియామ‌కానికి ఎవ‌రూ ద‌ర‌ఖాస్తులు చేసుకోలేద‌ని సంక్షేమ‌శాఖ స‌హాయ సంచాల‌కులు తెలిపారు. ఈ మెర‌కు, అభ్యంత‌రాలు క‌లిగిన వారు కార్యాల‌యంలో ప్ర‌క‌టించిన తేదీలోగా అంద‌జేయాల‌న్నారు.
Backlog jobs merit list
Backlog jobs merit list

సాక్షి ఎడ్యుకేష‌న్: దివ్యాంగుల విభాగంలో 23 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను https:// visakhapatnam.ap.gov.in/ లో పొందుపరిచారు. 24 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల నియామకానికి 2022–23లో నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. వర్క్‌షాప్‌ అటెండెంట్‌ ఉద్యోగానికి అంధ–మహిళ విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు జె.మాధవి తెలిపారు.

Supplementary Exam: 9 నుంచి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల సప్లిమెంటరీ పరీక్షలు

ఉద్యోగ తరగతి, వైకల్యం ప్రకారం మెరిట్‌ జాబితా సిద్ధం చేశామన్నారు. సహేతుకమైన అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 18 లోగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ కార్యాలయంలో అందించాలని సూచించారు.

Published date : 05 Oct 2023 05:14PM

Photo Stories