Skip to main content

National Workshop: మహిళా వర్సిటీలో జాతీయ వర్క్‌షాప్‌ ప్రారంభం

National Workshop
National Workshop

తిరుపతి సిటీ : పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఐపీటీ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లో సోమవారం డీబీటీ బిల్డర్‌ ప్రాజెక్ట్‌ టీమ్‌–1, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ సంయుక్తంగా ఐదు రోజుల హ్యాండ్లింగ్‌ ఆఫ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ అనిమల్స్‌ అన్న అంశంపై జాతీయ వర్క్‌షాపు ప్రారంభమైంది. ఇందులో వీసీ భారతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఔషధాల ప్రయోగాల్లో జంతువుల మీద పరిశోధనలు చేసేటప్పుడు అతి జాగ్రతలు పాటిస్తూ వాటికి ప్రాణహాని కలుగకుండా చూడాల్సిన అవసరముందన్నారు. పరిశోధన సమయంలో జంతువులను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్‌ డీన్‌ సుజాతమ్మ, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ హెడ్‌ శైలజ, కోఆర్డినేటర్‌ శ్రీదేవి, ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్లు రజిత, ఇందిరా ముజీబ్‌, సుజాత పాల్గొన్నారు.

Published date : 10 Oct 2023 06:31PM

Photo Stories