Skip to main content

Backlog Job Vacancies: దివ్యాంగుల పోస్టులకు 29లోగా దరఖాస్తు చేసుకోండి

Government Jobs in Joint Visakha District   Apply for Jobs in Anakapalli, Alluri Sitamaraju, and Visakha Districts   Backlog Job Vacancies  13 Backlog Jobs for Differently Abled Candidate

మహారాణిపేట : ఉమ్మడి విశాఖ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించిన 13 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయడానికి కలెక్టర్‌ ఎ.మల్లికార్జున నోటిఫికేషన్‌ జారీ చేశారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారాగానీ, స్వయంగా గానీ అందజేయాలని తెలియజేశారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయానికి 18 ఏళ్లు పైబడి, ఈ ఏడాది జూలై ఒకటి నాటికి 52 ఏళ్లు దాటకూడదన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను రాణి చంద్రమణి దేవి ఆస్పత్రిలో అందజేయాలని, పూర్తి వివరాలు https://visakhapatnam. ap.gov.in/లో చూసుకోవాలని సూచించారు.

Published date : 15 Mar 2024 05:59PM

Photo Stories