Skip to main content

Kakatiya University: 16న కేయూలో వర్క్‌షాప్‌

Workshop at Kakatiya University  Research and Methodology Workshop

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని కామర్స్‌ పీజీ అధ్యాపకుల కోసం రీసెర్చ్‌ అండ్‌ మెథడాలజీ, రీసెర్చ్‌ మెథడాలజీ అండ్‌ రిపోర్టింగ్‌ రైటింగ్‌పై వర్క్‌షాపును ఈనెల 16న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేయూలో వర్క్‌షాపు పోస్టర్‌ను వీసీ తాటికొండ రమేష్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాస్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాంపస్‌లోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌హాల్‌లో జరిగే వర్క్‌షాపునకు హాజరుకావాలని కోరారు. కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ నర్సింహాచారి, బీఓఎస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కట్ల రాజేందర్‌, అడ్జెంట్‌ ప్రొఫెసర్‌ పి.కృష్ణమాచార్య, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పృథ్వీరాజ్‌, కాంట్రాక్టు అధ్యాపకుడు ఫణీంద్ర పాల్గొన్నారు.

చ‌ద‌వండి: PG Exam Fee: పీజీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

Published date : 14 Dec 2023 12:25PM

Photo Stories