PG Exam Fee: పీజీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
![pg exam fee date extended PG Exam Deadline TEU PG Semesters Fee Payment Controller Aruna Announcement](/sites/default/files/images/2023/12/14/pg-exam-fee-1702535453.jpg)
తెయూ: తెయూ పరిధిలోని పీజీ సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లింపు తుదిగడువును ఈ నెల 15వరకు పొడిగించినట్లు కంట్రోలర్ అరుణ మంగళవారం తెలిపారు. పీజీ 3, 5, 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫీజును ఈ నెల 15వరకు, రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 18వరకు చెల్లించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంట్రోలర్ అరుణ కోరారు.
20 నుంచి డిగ్రీ పరీక్షలు
తెయూ: తెయూ పరిధిలోని డిగ్రీ (బీఏ, బీకా, బీఎస్సీ, బీబీఏ) 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు డిసెంబర్ 20 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ అరుణ మంగళవారం తెలిపారు. రిజిస్ట్రార్ యాదగిరి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు టీయూ వెబ్‌సైట్‌ణు సందర్శించాలని ఆమె కోరారు.
చదవండి: 10th & 12Th Class: సీబీఎస్‌ఈ పరీక్షల తేదీలు ఖరారు
31 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి
నిజామాబాద్‌అర్బన్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ ద్వితీయ, తృతీయ పరీక్షలకు ఈ నెల 31 వర కు అపరాధ రుసుము రూ. 500తో వార్షిక పరీ క్ష ఫీజు చెల్లించవచ్చని కో–ఆర్డినేటర్ రంజిత తెలిపారు. అలాగే పీజీ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు 16వరకు రూ.500 అపరాధ రు సుంతో చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 73829296 12 నంబర్‌ను సంప్రదించాలన్నారు.