Job Fair For Freshers: 1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు ఇవే
Sakshi Education
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జెన్పాక్ట్ ఆధ్వర్యంలో 1,500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ.కొండలరావు బుధవారం ఈ విషయం తెలిపారు.
కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. 2022/2023/2024 సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి, కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగిన విద్యార్థులు అర్హులన్నారు.
ఎంపికై న వారు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలవారు https://bit.ly/46 Wzqz6 లో వివరాలు నమోదు చేసుకోవాలని, అవసరమైతే 99888 53335 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Published date : 23 Aug 2024 10:45AM