Skip to main content

ECIL: డిప్లొమా, బీటెక్ అర్హ‌త‌తో హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... జీతం ఎంతంటే...

ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్‌)లో ప్రాజెక్ట్ ఇంజినీర్(Project Engineer), టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer), అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్(Assistant Project Engineer) పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
ECIL ,Project Engineer, Technical Officer, Job Opportunity, Apply Now
డిప్లొమా, బీటెక్ అర్హ‌త‌తో హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... జీతం ఎంతంటే...

కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో వీటిని భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప‌ని చేయాల్సి ఉంటుంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు:

1. ప్రాజెక్ట్ ఇంజినీర్

2. టెక్నికల్ ఆఫీసర్

3. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్

ఇవీ చ‌ద‌వండి: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 30,041 పోస్టులు.. ఉద్యోగాల వివరాలు, ఎంపిక విధానం

మొత్తం పోస్టుల సంఖ్య: 163

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. 

వేతనం: ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.45,000 నుంచి రూ.55,000. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000 మ‌ధ్య అంద‌జేస్తారు.

అభ్య‌ర్థులు షిల్లాంగ్, బరక్‌పుర్, కోల్‌కతా, టాటానగర్, నారేంగి, హైదరాబాద్, వైజాగ్, రావత్‌భట, గోరఖ్‌పూర్, నరోరా, లేహ్, అనుప్‌గఢ్, న్యూదిల్లీ, ఫిరోజ్‌పూర్, గురుగ్రామ్, లఖ్‌నవూ, ఆజంగఢ్, అలహాబాద్, కైగా, గౌరీబిదనూర్, కొచ్చిన్, న్యూ మంగళూరు, ట్యుటికోరిన్, కుడంకుళం, కక్రపర్, జామ్‌నగర్, నాలియా, ద్వారక, ముంబయి, తారాపూర్ లోని ఈసీఐఎల్‌ కేంద్రాలలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఇవీ చ‌ద‌వండి: ప్రభుత్వ పాఠశాలల్లో 6,329 Teaching & Non-Teaching Posts 

ఇంటర్వ్యూ తేదీలు: 01/09/2023, 04/09/2023.

వేదిక: ముంబయి, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలోని ఈసీఐఎల్‌ కార్యాలయాల్లో.

మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.ecil.co.in/ వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వచ్చు.

Published date : 24 Aug 2023 02:39PM
PDF

Photo Stories