Skip to main content

Non-Teaching Jobs in KGBV: నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

Non-Teaching Jobs in KGBV

సాక్షి, పాడేరు: సమగ్రశిక్షా ఆధ్వర్యంలో జిల్లాలో నడుస్తున్న కేజీబీవీలో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని డీఈవో, ఇన్‌చార్జి ఏపీడీ సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ మండలాల్లోని కేజీబీవీల్లో కుక్‌లు, అసిస్టెంట్‌ కుక్‌లు, డే అండ్‌ నైట్‌ వాచ్‌ఉమెన్‌ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. నెలకు రూ.7 వేల వేతనం ఉంటుందన్నారు. ఈ పోస్టులకుగాను ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వీటిని ఈనెల 21వతేదీ సోమవారం సాయంత్రం 5గంటల లోపు జిల్లా కేంద్రం పాడేరులోని పీఎంఆర్‌సీ భవనంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునే మహిళలు ఏడవ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలని ఆయన పేర్కొన్నారు.

చదవండి: APPSC Group 1&2 Notification: త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు

Published date : 19 Aug 2023 05:16PM

Photo Stories