Skip to main content

AI will replace women employees: ఉద్యోగాలు కోల్పోనున్న కోటి మంది మ‌హిళ‌లు... ఏఐతో వీరికి త‌ప్ప‌ని ముప్పు...!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంచ‌నాల‌ను మించి దూసుకెళుతోంది. అన్నిరంగాల్లోకి విస్త‌రిస్తోంది. ఒక‌సారి ప్రోగ్రామింగ్ చేస్తే చాలు.. ఇక దానిప‌ని అది చేసుకుపోతుండ‌డంతో అనేక కంపెనీలు ఏఐకి అత్య‌ధిక ప్రాముఖ్య‌త‌ను ఇస్తున్నాయి. మ‌నుషులు చేసే ప‌నిని వీలైనంత త్వ‌ర‌గా, అత్యంత ఖచ్చిత‌త్వంతో చేస్తుండ‌డంతో ఉద్యోగుల‌ను ఏఐ రీప్లేస్ చేస్తోంది.
AI will replace women employees
AI will replace women employees

ఇప్ప‌టివ‌ర‌కు మ‌నుషులు మాన్యువ‌ల్‌గా చేసిన పనులను ఏఐ ఈజీగా ఆటోమేష‌న్ చేస్తోంది. కార్యాలయాల్లో మనుషుల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తోంది. అయితే ఇది పురుష ఉద్యోగుల కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులను భర్తీ చేయ‌నున్న‌ట్లు తాజా నివేదిక ఒక‌టి వెలుగులోకి తెచ్చింది. పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల‌కు జీతాల విష‌యంలో వివ‌క్ష ఉంటుంది. నైపుణ్యాలు లేని మ‌హిళ‌ల‌కు ఇక అర‌కొర జీతాలే ఇస్తున్నాయి అనేక కంపెనీలు. ఈ అర‌కొర వేత‌నానికి ఏఐ గండి కొట్ట‌నుంది.

ఇవీ చ‌ద‌వండి: ఫ‌స్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో ఫెయిల్‌... సెకండ్‌ అటెంప్ట్‌లో రెండో ర్యాంకు సాధించానిలా...

AI

'జనరేటివ్ ఏఐ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇన్ అమెరికా' పేరుతో మెకెన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో 2030 నాటికి అమెరికా జాబ్ మార్కెట్‌పై కృత్రిమ మేధ గణనీయమైన ప్రభావాన్ని చూప‌నున్న‌ట్లు వెల్ల‌డైంది. ఆటోమేషన్ డేటా సేకరణ, రీ సైక్లింగ్‌ పనులను ఏఐ భర్తీ చేస్తుందని అధ్యయనం పేర్కొంది. 2030 నాటికి ఒక్క అమెరికాలోనే సుమారు 12 మిలియన్ల మంది త‌మ ఉద్యోగాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని బాంబ్ పేల్చింది. 

ఇవీ చ‌ద‌వండి:  కోటి రూపాయ‌ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన ఐఐఐటీ అమ్మాయి... కోడింగ్‌పై ప‌ట్టుంటే కోట్లు కొళ్ల‌గొడుతున్న విద్యార్థులు

ఉద్యోగ మార్పులు పురుషులతో పోలిస్తే మహిళలను తీవ్రంగా ప్రభావితం చేయ‌నుంది. మహిళలు ఎక్కువ‌గా చేసే ప‌నుల‌ను ఏఐ ఆటోమేట్ చేయ‌నుంది. ఫ‌లితంగా నైపుణ్యాలు లేని మ‌హిళ‌లు కొత్త వృత్తుల్లోకి మారాల్సిన అవసరం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు 1.5 రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌స్తుందని మెకిన్సే నివేదిక తెలిపింది.

AI

ఇవీ చ‌ద‌వండి: 18 ఏళ్ల‌కే డ్రోన్ పైల‌ట్ అయ్యా... నా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

యునైటెడ్ స్టేట్స్‌ కస్టమర్ సర్వీస్ ప్రతినిధులలో 80 శాతం మంది మహిళలు ప‌ని చేస్తున్నారు. ఆఫీస్ సపోర్ట్ వర్కర్లలో 60 శాతం మంది వీరే ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ రెండు ఉద్యోగాల‌ను కృత్రిమ మేధ ఆక్ర‌మించ‌నుంది. ఫ‌లితంగా వీరంతా ఉపాధిని కోల్పోయి రోడ్డున‌ప‌డాల్సిన దుస్థితి నెల‌కొన‌నుంది. రీటైల్ సేల్స్‌, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్‌, క్యాషియర్ ఈ ఉద్యోగాలు భ‌విష్య‌త్తులో ఏఐ చేయ‌నుంది.

Published date : 10 Aug 2023 02:45PM

Photo Stories