Skip to main content

Duping Job Offer: తస్మాత్ జాగ్రత... ఉద్యోగం పేరిట రూ.2.50 కోట్ల మోసం!

ఉద్యోగం పేరిట రూ.2.50 కోట్ల మోసం
Fake Job Offer

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2.50 కోట్లు మోసం చేసిన దంపతులను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. మార్తాండంకు చెందిన ఓ యువకుడు కుమారి జిల్లా ఎస్పీకి ఆన్‌లైన్‌లో ఓ ఫిర్యాదు చేశాడు.

AP Faculty Jobs 2023: ఏపీ డీఎంఈలో 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

అందులో... నేను శ్రీశ్రీ ఎంబీఏ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. న్యామలైకాడై ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఫైనాన్షియల్‌ సంస్థలో పని చేసేవాడిని. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో జాబ్‌ ఆఫర్‌ గురించి నాకు ఓ మెయిల్‌ వచ్చింది. అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాను. ఓ వ్యక్తి మాట్లాడాడు. దేశంలోని విమానాశ్రయాల్లో వివిధ ఖాళీలు ఉన్నాయి. మీ చదువు ఆధారంగా మేము నిర్వహించే పరీక్షలో పాస్‌ అయితే ఉద్యోగం లభిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ చైన్నెలో జరుగుతాయి. అందులో మీరు పాల్గొనాలని తెలిపారు.

Fresher Jobs: ఆంగ్లంపై పట్టు ఉందా... అయితే మీ కోసం 200 ఉద్యోగాలున్నాయి!

అతని మాటలు నమ్మి చైన్నె వెళ్లాను. వారు చెప్పిన చిరునామాలో ఓ ప్రైవేట్‌ హోటల్‌ ఉంది. పోస్టులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు అక్కడే జరిగాయి. పరీక్ష అనంతరం వివరాలను మెయిల్‌కు పంపుతామని తెలిపారు. పైలట్‌, ఎయిర్‌పోర్టు సూపర్‌వైజర్‌తో పాటు పలు ఖాళీలు ఉన్నాయని వారు తెలిపారు. నాకు, మా సోదరుడికి విమానాశ్రయంలో ఉద్యోగం కావాలని అడిగాను. ఇద్దరికి కలిపి రూ. 2.50 కోట్లు చెల్లించాలని చెప్పారు. వారు మాటలు నమ్మి రూ.2.50 కోట్లు నా బ్యాంకు ఖాతా నుంచి చెల్లించాను. ఏళ్లు గడిచినా ఉద్యోగం ఇవ్వలేదు.

Telangana Jobs 2023: 156 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీశ్రీ కోరాడు. ఈ పిటిషనన్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీ హరికిరణ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. సైబర్‌ క్రైమ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజేంద్రన్‌, ఇనన్‌స్పెక్టర్‌ వసంతి, ఎస్‌ఐ అజ్మల్‌ విచారణ చేపట్టారు. తిరుపూర్‌ జిల్లా ఉడుమలైపేట్‌ ప్రాంతానికి చెందిన రంజిత్‌ (45), అతని భార్య అంబిక (36) ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. వారిని ఉడుమలైపేటలో ఆదివారం అరెస్టు చేశారు.

Published date : 18 Jul 2023 06:37PM

Photo Stories