ప్రభుత్వ ఉద్యోగం పేరిట రూ.14 లక్షల మోసం
తెన్ కాశి జిల్లా కడైయం సమీపంలోని వేయికలిపట్టి శబరినగర్‌కు చెందిన జయకుమార్, జాయ్‌లిన్ బాల (40) దంపతుల కుమారుడు జైన్ జోస్ పాలిటెక్నిక్ చదివాడు. ఈ స్థితిలో అదే ప్రాంతానికి చెందిన శక్తివేల్ భార్య వసంతి తన భర్త చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాడని, జైన్ జోస్‌కి కూడా ప్రభుత్వ ఉద్యోగం తీసిస్తాడని చెప్పింది. దీన్ని నమ్మిన జాయ్‌లిన్ బాల వారికి రూ.14 లక్షలు ఇచ్చింది. ఎన్నిరోజులైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని వసంతిని కోరింది.
చదవండి: Fake Jobs: రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం
భర్త శక్తివేల్ (44), ఆమె సోదరుడు లక్ష్మణన్ (46), మురుగన్ (37) డబ్బు తిరిగి ఇవ్వలేమని జాయ్‌లిన్ బాలపై దాడి చేశారు. దీంతో జాయ్‌లిన్ బాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ గౌతమన్ కేసు నమోదు చేసి అక్టోబర్ 20న తెల్లవారుజామున శక్తివేల్, వసంతి, లక్ష్మణన్, మురుగన్‌ను అరెస్టు చేశారు.