Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీఏ).. 2022 ఏప్రిల్ సంవత్సరానికి గాను 58వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 29వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 191
పోస్టుల వివరాలు: షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్–175, ఎస్‌ఎస్‌సీ(టెక్) ఉమెన్–14, విడోస్ డిఫెన్స్ పర్సనల్–02.
విభాగాలు: సివిల్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ తదితరాలు.
అర్హత: ఎస్‌ఎస్‌సీ(టెక్), మెన్/ఉమెన్ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ విడోస్(నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ) ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్)–బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఎస్‌ఎస్‌సీ(టెక్) మెన్/ఉమెన్–01.04.2022 నాటికి 20–27ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌ఎస్‌సీ విడోస్(నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ), ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్)–01.04.2022 నాటికి 35ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: చివరి సెమిస్టర్/ఏడాదిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021
వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in/
Qualification | GRADUATE |
Last Date | October 27,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |