JEE Mains: అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..
Sakshi Education
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE Mains తొలి దశ పరీక్ష జూన్ 23 నుంచి జరుగుతుంది.
జూన్ 29 వరకూ జరిగే మొదటి విడత మెయిన్స్‌కు National Testing Agency (NTA) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసినట్టు NTA పేర్కొంది. అయితే, జూన్ 18 నుంచే ఇవి డౌన్‌లోడ్ కావాల్సి ఉన్నా, సైట్ ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో జూన్ 21 NTA మరో ప్రకటన విడుదల చేసింది. అడ్మిట్ కార్డులు తమ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి, తేలికగా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష కేంద్రం ఎక్కడ నేది అడ్మిట్ కార్డులోనే ఉంటుందని పేర్కొంది.
>> Download JEE Main Phase I Admit Card 2022 | Check Model papers & Previous Papers Here!!
చదవండి:
JEE Main Guidance
JEE Main Syllabus
JEE Main Model papers
JEE Main Previous Papers
Published date : 22 Jun 2022 05:47PM