JEE Mains Cancel: జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రద్దు.. కారణం ఇదే ?
అబిడ్స్‌లోని ఆరోరా కాలేజీలో తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యల వల్ల జేఈఈ మెయిన్స్ పరీక్ష రద్దు చేశామని కాలేజీ సిబ్బంది తెలిపారు. ఈ కాలేజీ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే, రెండు, మూడేళ్లు నుంచి జేఈఈకి ప్రిపేర్ అవుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఎగ్జామ్ వాయిదా వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అబిడ్స్ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇంకా జరగలేదు. ఇదే విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్‌డౌన్, టెక్నికల్ ప్రాబ్లమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీ కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మిగతా సెంటర్లలో నేడు ఈ పరీక్ష యథావిధిగా జరిగింది.
JEE Mains: అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..
తొలి సెషన్‌కు తుది ప్రిపరేషన్.. 90 ప్రశ్నలు - 300 మార్కులు
తెలంగాణలో..
జూన్ 29వ తేదీ వరకూ ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 1.90 లక్షల మంది హాజరవనున్నారు. ఇప్పటికే National Testing Agency (NTA) విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేసింది. Covid తర్వాత జరిగే మెయిన్స్ ఈసారి భిన్నంగా ఉంటుందని NTA తెలిపింది. రాష్ట్రాల పరిధిలోని వివిధ బోర్డులు ఇంటర్, తత్సమాన స్థాయి పరీక్షల్లో 70% సిలబస్‌ను మాత్రమేబోధించాయి. అయితే JEEలో మాత్రం ఈ నిబంధన వర్తించే అవకాశం లేదు. కాకపోతే ఇది వరకు మాదిరి 90 ప్రశ్నలిచ్చి మొత్తం సమాధానాలు రాయాలనే నిబంధనలో మార్పు చేశారు. 75 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. అంటే జేఈఈ మెయిన్స్ పేపర్ 360 మార్కులకు బదులు 300 మార్కులకే ఉంటుందని సమాచారం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిచాల్సిందే..
JEE Mains కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిషన్ కార్డుతో పాటు, కోవిడ్ లేదన్న స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఏదైనా ఐడీ(ఆధార్ లాంటిది) తీసుకొని వెళ్లాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, మాస్క్, హ్యాండ్ శానిటై జర్, బాల్ పాయింట్ పెన్ను వెంట తీసుకెళ్లాలి. పరీక్ష రెండు షిఫ్టు్టలుగా ఉంటుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకూ ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ ‘ఒక నిమిషం’ నిబంధన అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. కాబట్టి వీలైనంత వరకూ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఈసారి సెక్షన్ బీలో కూడా నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది.
నెగెటివ్ మార్కులతో జాగ్రత్త.. దీని ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు