Skip to main content

JEE Advanced 2022: రిజిస్ట్రేషన్లు తేదీ ఇదే..

IIT, NITల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (JEE) Advanced–2022–23కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానుంది.
JEE Advanced 2022 registrations
జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు తేదీ ఇదే..

ఆగస్టు 11న సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగియనుంది. రిజిస్టర్డ్‌ అభ్యర్థులు ఫీజులను ఆగస్టు 12లోగా చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులను IIT Bombay స్వీకరించనుంది. JEE Mainలో అర్హత సాధించిన వారిలో టాప్‌ 2.5 లక్షల మంది JEE Advanced రాసేందుకు అర్హులు. కాగా, JEE Main తొలి విడత పరీక్షలు జూన్‌ 30తో ముగియగా రెండో విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. JEE Mainకు దేశవ్యాప్తంగా 8.72 లక్షల మంది దరఖాస్తు చేయగా తొలివిడత పరీక్షకు 7.69 లక్షల మంది హాజరయ్యారు. రెండో విడత సెషన్‌ పరీక్షలు ముగిసిన అనంతరం మెయిన్‌లో ర్యాంకులు సాధించిన వారి ఫలితాలను ఆగస్టు 6 లోగా National Testing Agency ప్రకటించనుంది. JEE Advanced పరీక్షకు అడ్మిట్‌ కార్డులను ఆగస్టు 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో IIT Bombay పొందుపరచనుంది. స్క్రయిబ్‌ అవసరమయ్యే అభ్యర్థులు ఆగస్టు 27లోగా సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 28న JEE Advanced పరీక్ష జరుగుతుంది.

Published date : 15 Jul 2022 02:31PM

Photo Stories