Skip to main content

అన్వయ నైపుణ్యంతో జేఈఈని జయించండిలా..

నచ్చిన రంగంలో..మెచ్చిన వేతనంతో ఇంజనీర్‌గా స్థిరపడాలనుకుంటారు కొందరు.. సృజనాత్మక పునాదులే ఆసరాగా శాస్తవ్రేత్త స్థాయికి ఎదగాలని తపిస్తారు మరికొందరు.. అత్యున్నత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సులు చేసే అవకాశం లభించినప్పుడే వీరి ఆశలు నెరవేరుతాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ఔత్సాహికులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌-2014కు రంగం సిద్ధమైంది. ప్రాథమికంగా పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్‌ ప్రణాళిక..

విద్యార్థులు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కాన్సెప్టులను పూర్తిగా నేర్చుకున్న తర్వాత జేఈఈ (జాయింట్‌ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌) మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ స్థాయి ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. ఈపాటికే సిలబస్‌ పూర్తయితే ప్రాక్టీస్‌, గ్రాండ్‌ టెస్ట్‌లు రాసి, ఏ టాపిక్‌లో తక్కువ మార్కులు వస్తున్నాయో గుర్తించాలి. దానికి అధిక సమయం కేటాయించాలి. ఐఐటీ సీటు పొందాలంటే టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి. అదే నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర జాతీయస్థాయి సంస్థల్లో ప్రవేశం పొందాలంటే మెయిన్‌లో ప్రతిభ కనబర్చాలి. దీనికి 60 శాతం వెయిటేజీ ఉండగా, ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. అందువల్ల ఇంటర్‌ పరీక్షలపై పూర్తిస్థాయి శ్రద్ధపెట్టాలి.

కాన్సెప్టులపై పట్టు సాధించాలి:

జేఈఈ మెయిన్‌లో ప్రాథమిక భావనలు (Fundamental Concepts) పై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అడ్వాన్స్‌డ్‌లో మాత్రం లోతుగా ప్రశ్నలు వస్తాయి. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కష్టమైనదే అయినా ఆత్మవిశ్వాసంతో, నిర్దిష్ట ప్రణాళికతో చదివితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. గత మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పేపర్లను చూస్తే కెమిస్ట్రీలో 60 శాతం ప్రశ్నలు, ఫిజిక్స్‌లో 50 శాతం ప్రశ్నలు, మ్యాథ్స్‌లో 50 శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాల నుంచి వచ్చాయి. కాబట్టి ఎక్కువ పుస్తకాలను చదివేకంటే కాలేజీ మెటీరియల్‌ను క్షుణ్నంగా చదివి, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపై దృష్టిపెట్టాలి. ఫిజిక్స్‌లో మెకానిక్స్‌, ఎలక్ట్రో స్టాటిక్స్‌; కెమిస్ట్రీలో భౌతిక రసాయన శాస్త్రం; మ్యాథ్స్‌లో ఆల్జీబ్రా, మాత్రికలు, వెక్టార్‌ ఆల్జీబ్రా, 3-డి జ్యామితిపై దృష్టిపెడితే సులభంగా 50 శాతం మార్కులు పొందొచ్చు.

జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఐఐటీ-జేఈఈలో ఇంటీజర్‌, మ్యాట్రిక్స్‌ మేచింగ్‌, పారాగ్రాఫ్‌ ప్రశ్నలు; జేఈఈ మెయిన్‌లో అసెర్షన్‌- రీజనింగ్‌ టైప్‌ ప్రశ్నలు ఎక్కువగా ఇస్తున్నారు. విద్యార్థులు వీటిలో ఎక్కువ పొరపాట్లు చేస్తున్నారు. అందువల్ల వీటిని బాగా ప్రాక్టీస్‌ చేయాలి. గత మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి.

మ్యాథమెటిక్స్‌
మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ముందుగా బేసిక్‌ కాన్సెప్టులపై పట్టు సాధించాలి. మొత్తం సిలబస్‌ను కాలిక్యులస్‌, జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్టార్స్‌, 3-డి జామెట్రీ భాగాలుగా విభజించుకోవాలి. కాలిక్యులస్‌, ఆల్జీబ్రాపై ఎక్కువ శ్రద్ధపెట్టి, వాటి అనువర్తనాలను గమనించాలి. ఇంటెగ్రల్‌ క్యాలిక్యులేషన్స్‌, డిఫరెన్షియల్‌ క్యాలిక్యులేషన్స్‌, 3-డి ప్లేన్స్‌, లైన్స్‌, ప్రస్తారాలు- సంయోగాలు, సంభావ్యత, మాత్రికలు చాప్టర్లకు అధిక సమయం కేటాయించాలి. అప్లికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలంటే ముందుగా చదివిన అంశాలకు సంబంధించి ప్రతి వారం పరీక్ష రాయడం అలవరచుకోవాలి. చదివిన టాపిక్స్‌లోని ముఖ్యాంశాలతో నోట్స్‌ రూపొందించుకోవాలి.

రిఫరెన్స్‌: కాలేజీ మెటీరియల్‌, ఎంటీజీ బుక్స్‌, ప్రీవియస్‌ పేపర్స్‌ (సాల్వ్‌డ్‌)- అరిహంత్‌.

ఫిజిక్స్‌
ఇప్పటికే సిలబస్‌ పూర్తవుతుంది కాబట్టి అన్ని వారాంతపు టెస్ట్‌లు, గ్రాండ్‌ టెస్ట్‌లు రాసి, స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తొలుత ప్రాథమిక భావనలు, నిర్వచనాలు, సూత్రాలపై దృష్టిసారించాలి. తర్వాత ప్రాథమిక భావనలు ఆధారంగా ఎక్కువ సమస్యల్ని సాధన చేయాలి. అందుబాటులో ఉన్న సమయంలో ప్రణాళిక ప్రకారం టాపిక్స్‌ను పూర్తిచేయాలి.

అక్టోబర్‌ 20 - 31: హీట్‌ అండ్‌ ఎక్స్‌ప్యాన్షన్‌
నవంబర్‌ 1 - 14: మెకానిక్స్‌
నవంబర్‌ 15 - 30: థర్మోడైనమిక్స్‌, ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌
డిసెంబర్‌ 1 - 15: ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజం
డిసెంబర్‌ 16 - 31: మోడర్న్‌ ఫిజిక్స్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌
జనవరి 1 - 15: ఆప్టిక్స్‌ అండ్‌ సౌండ్‌
  • ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, రొటేటరీ మోషన్‌ టాపిక్స్‌ ముఖ్యమైనవి, క్లిష్టమైనవి. అయినా లెక్చరర్ల సహకారంతో కొద్దిగా కష్టపడితే సులువుగానే నేర్చుకోవచ్చు.
  • అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు చదివే అన్ని అంశాలూ మెయిన్‌కు ఉపయోగపడతాయి. అయితే మెయిన్‌కు మాత్రమే ఉండే టాపిక్స్‌ కొన్ని ఉన్నాయి. అవి: సెమీ కండక్టర్‌, లాజిక్‌ గేట్స్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ప్రాక్టికల్‌ ఫిజిక్స్‌.
రిఫరెన్స్‌: కాలేజీ మెటీరియల్‌, కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ 1 అండ్‌ 2 (ఏ.ఇ.గ్ఛటఝ్చ).

కెమిస్ట్రీ
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లతో పోల్చితే జేఈఈ మెయిన్‌ కెమిస్ట్రీ సులభమైనది. ఫార్ములాలు, కాన్సెప్టులపై అవగాహన మెయిన్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌లోనూ ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
  • గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే ఫిజికల్‌ కెమిస్ట్రీ నుంచి 40 శాతం, ఆర్గానిక్‌ నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఈ విభాగాలను ప్రాధాన్యతా క్రమంలో చదవాలి. భౌతిక రసాయన శాస్త్రంలో ప్రతి చాప్టర్‌ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సమతాస్థితి, విద్యుత్‌ రసాయన శాస్త్రం, థర్మో కెమిస్ట్రీ, ద్రావణాల్లోని collegative ప్రాపర్టీస్‌, ఘనస్థితి వంటి చాప్టర్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటిలో కేవలం ఫార్ములాలను మాత్రమే కంఠతా చేయకుండా వాటికి సంబంధించి విషయ పరిజ్ఞానాన్ని కూడా లోతుగా తెలుసుకోవాలి.
  • విద్యార్థులు సాధారణంగా పాలిమర్స్‌, బయో మాలిక్యూల్స్‌ పాఠ్యాంశాలను విస్మరిస్తుంటారు. కానీ, వాటి నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలోని పరమాణు నిర్మాణంలో ఎలక్ట్రాన్‌ విన్యాసం, క్వాంటం సంఖ్యలు, హైడ్రోజన్‌ వర్ణపటం, రసాయన బంధాల్లో హైబ్రిడైజేషన్‌, మాలిక్యులర్‌ ఆర్బిటల్‌ సిద్ధాంతం అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కోఆర్డినేట్‌ కెమిస్ట్రీ; డి, ఎఫ్‌ బ్లాక్‌ మూలకాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • ఆర్గానిక్‌ అంశాలను ఎంత ఎక్కువగా రివిజన్‌ చేస్తే అంత మంచిది. అన్ని రసాయన సమ్మేళనాల ధర్మాలు, తయారీ, సీక్వెన్స్‌ ఆఫ్‌ రియాక్షన్స్‌ తదితరాలను ప్రాక్టీస్‌ చేయాలి. కాంపౌండ్స్‌ తయారీ, ఎలక్ట్రోడ్‌‌స, ఎలక్ట్రోలైట్స్‌ తదితర విధానాలను టేబుల్‌ రూపంలో మార్చుకొని ప్రిపేర్‌ కావాలి.
రిఫరెన్స్‌: ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలు, ఫిజికల్‌ కెమిస్ట్రీ-పి.బహదూర్‌; ఆర్గానిక్‌ కెమిస్ట్రీ- ఆర్‌.జె.మారిసన్‌.

టాపర్స్‌ టాక్‌:
  • రోజుకు 4 గంటలు చదివేందుకు సమయం కేటాయిస్తే అందులో రెండు గంటలు కెమిస్ట్రీ, గంట చొప్పున ఫిజిక్స్‌, మ్యాథ్స్‌కు కేటాయించుకోవాలి. ఏకబిగిన చదివితే ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. బోర్‌ అనిపిస్తే సబ్జెక్టు మార్చుకోవాలి.
  • జేఈఈలో ర్యాంకు సాధించటం అంత తేలికకాదు. లక్షల మందితో పోటీపడుతున్నపుడు ఓర్పు, సబ్జెక్టులపై పట్టు కీలకం.
  • ప్రతి సబ్జెక్టు కాన్సెప్ట్స్‌పై లోతైన అధ్యయనం చేయాలి. బలహీనంగా ఉన్న సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • మ్యాథ్స్‌ బాగా ప్రాక్టీసు చేయాలి. మ్యాథ్స్‌లో క్యాలిక్యులస్‌, లిమిట్స్‌, డిఫ్రెన్సియేషన్‌, ఇంటిగ్రేషన్‌ వంటి అంశాల్లో ఎక్కువ ప్రశ్నలుంటాయి.
  • మోడ్రన్‌ ఫిజిక్స్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పట్టు సాధిస్తే మంచి స్కోరుకు వీలుంటుంది.
  • 20-30 గ్రాండ్‌ టెస్టులు సీరియస్‌గా రాయాలి. రాసిన తర్వాత తప్పులను గుర్తించి సవరించుకోవాలి. అప్పుడే ర్యాంకు సాధించగలరు.
జేఈఈ మెయిన్‌ (2013) కటాఫ్‌
2013 జేఈఈ మెయిన్‌ నుంచి 1,50,000 మంది విద్యార్థులు ఈ కింది కటాఫ్‌ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు.

కేటగిరీ
మొత్తం మార్కులు 360
కామన్‌ మెరిట్‌ లిస్ట్‌ 113
ఓబీసీ (నాన్‌ క్రిమీలేయర్‌) 70
ఎస్సీ 50
ఎస్టీ 40


జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (2013) కటాఫ్‌ మార్కులు (360కు)
కేటగిరీ మార్కులు
జనరల్‌ 126
ఓబీసీ 113
ఎస్సీ 63
ఎస్టీ 63
పీడీ 63


జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం:
కోర్సు పేపర్‌ సబ్జెక్టులు వ్యవధి
బీఈ/ పేపర్‌-1 ఫిజిక్స్‌, బీటెక్‌, కెమిస్ట్రీ, మాథ్స్ 3 గం.
బీఆర్‌‌క/బీ ప్లానింగ్‌ పేపర్‌-2 మాథ్స్ , ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డ్రాయింగ్‌ టెస్ట్‌ 3 గం.


అడ్వాన్స్‌డ్‌:
పేపర్‌ పరీక్ష వ్యవధి
పేపర్‌ -1 3 గంటలు
పేపర్‌ -2 3 గంటలు

Published date : 17 Oct 2013 05:04PM

Photo Stories