Skip to main content

సాధనే సరైన సక్సెస్ మంత్రం!

Inter గణితం(Mathematics), అర్థ శాస్త్రం (Economics), వాణిజ్య శాస్త్రం (Commerce).. నేటి యువతరం కలల కొలువులకు భరోసా ఇచ్చే ఉత్తమ సబ్జెక్టులు. సీఏ, సీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశించి, కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇంటర్ ఎంఈసీ గ్రూప్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. దీన్ని మంచి మార్కులతో పూర్తిచేసి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దు కోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ ఎంఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక..

మ్యాథమెటిక్స్
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మ్యాథమెటిక్స్ 2-ఎ, 2-బి పాఠ్య ప్రణాళికలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు తొలుత వీటిపై బాగా అవగాహన పెంపొందించుకొని, తర్వాత పరీక్షలకు సిద్ధమవాలి.

2-ఎ సిలబస్:
యూనిట్ 1: సంకీర్ణ సంఖ్యలు(8 మార్కులు);
యూనిట్ 2: డిమోయర్ సిద్ధాంతం (9 మార్కులు);
యూనిట్ 3: వర్గ సమాసాలు (6 మార్కులు);
యూనిట్ 4: సమీకరణవాదం (9 మార్కులు);
యూనిట్ 5: ప్రస్తారాలు-సంయోగాలు (12 మార్కులు);
యూనిట్ 6: ద్విపద సిద్ధాంతం (16 మార్కులు);
యూనిట్ 7: పాక్షిక భిన్నాలు(4 మార్కులు);
యూనిట్ 8: విస్తరణ కొలతలు(9 మార్కులు);
యూనిట్ 9: సంభావ్యత(15 మార్కులు);
యూనిట్ 10: యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యతా విభాజనాలు(9 మార్కులు).

ప్రశ్నపత్రం:
  • విద్యార్థులు మొత్తం 75 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. విభాగం-ఎలో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
  • విభాగం-బిలో 7 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు.
  • విభాగం-సిలో 7 దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు ఏడు మార్కులు.
  • ప్రశ్నపత్రం దాదాపు తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలో చివర్లో ఇచ్చిన మాదిరి ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది.
ప్రిపరేషన్ వ్యూహం:
  • 2, 4, 6, 8, 9, 10 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఆరో యూనిట్ నుంచి రెండు దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు ఈ యూనిట్‌లోని సమస్యల్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి.
  • విస్తరణ కొలతలు (యూనిట్ 8)లో దీర్ఘసమాధాన ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు సంవర్గమానాలు ఉపయోగించి సూక్ష్మీకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రామాణిక విచలనం కనుగొనేందుకు వర్గమూలం తెలుసుకోవాలి. ఈ సందర్భంలోనూ సంవర్గమానాల అవసరం ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఈ యూనిట్‌లోని ప్రశ్నకు సమాధానం రాసేందుకు సంవర్గమానాలను ఉపయోగించడం నేర్చుకోవాలి.
  • 1, 3, 5,7, 9 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఇందులో 5, 9 యూనిట్ల నుంచి రెండేసి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
  • విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేందుకు అతి స్వల్ప సమాధాన ప్రశ్నల విభాగం చాలా ముఖ్యం. అందువల్ల ఈ ప్రశ్నలకు సమాధానాల్ని క్షుణ్నంగా నేర్చుకోవాలి. 7, 9 యూనిట్లలోతప్ప మిగిలిన అన్ని యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటిక్స్ 2-బి:సిలబస్:
యూనిట్ 1: వృత్తం(22 మార్కులు);
యూనిట్ 2: వృత్తసరణులు (6 మార్కులు);
యూనిట్ 3: పరావలయం (9 మార్కులు);
యూనిట్ 4: దీర్ఘవృత్తం (8 మార్కులు);
యూనిట్ 5: అతి పరావలయం (6 మార్కులు);
యూనిట్ 6: సమాకలనం (18 మార్కులు);
యూనిట్ 7: నిశ్చిత సమాకలనులు (15 మార్కులు);
యూనిట్ 8: అవకలన సమీకరణాలు (13 మార్కులు).
2-బి ప్రశ్నపత్రం.. 2-ఎ ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది.

ప్రిపరేషన్ వ్యూహం:
  • వృత్తం, సమాకలనం, నిశ్చిత సమాకలనాల యూనిట్ల నుంచి అత్యధికంగా 55 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • 1, 3, 6, 7, 8 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 1, 6 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. 1, 3, 4, 5, 7, 8 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. 4వ యూనిట్ నుంచి రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 5, 6, 7, 8 యూనిట్ల నుంచి అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 1, 6, 7 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి.
  • విద్యార్థులు ప్రతి యూనిట్ చివర ఇచ్చిన సూత్రాలను సాధన చేయాలి.
కామర్స్
పార్ట్-1 వాణిజ్య శాస్త్రం సిలబస్:
యూనిట్ 1:
అంతర్జాతీయ వర్తకం.
యూనిట్ 2: మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యాపార ప్రకటనలు, వినియోగదారిత్వం.
యూనిట్ 3: వ్యాపార సేవలు.
యూనిట్ 4: స్టాక్ ఎక్స్చేంజ్‌లు.
యూనిట్ 5: కంప్యూటర్ అవగాహన.

పార్ట్- 2 వ్యాపార గణక శాస్త్రం:
యూనిట్ 1: వర్తకం బిల్లులు, తరుగుదల.
యూనిట్ 2: కన్‌సైన్‌మెంట్ ఖాతాలు.
యూనిట్ 3: వ్యాపారేతర సంస్థల ఖాతాలు.
యూనిట్ 4: ఒంటిపద్దు విధానం.
యూనిట్ 5: భాగస్వామ్య వ్యాపార ఖాతాలు, భాగస్తుని ప్రదేశం, భాగస్తుని విరమణ.

ప్రశ్నపత్రం:
పార్ట్- 1 థియరీ- 50 మార్కులు
విభాగం మార్కులు సమయం
సెక్షన్-ఎ 10 x 2 = 20 35 నిమిషాలు
సెక్షన్-బి 4 x 5 = 20 35 నిమిషాలు
సెక్షన్-సి 5 x 2 = 10 20 నిమిషాలు
  • సెక్షన్-ఎ విభాగంలో వ్యాసరూప ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెటింగ్ వ్యవస్థ, వ్యాపార సేవలు, వినియోగదారిత్వం యూనిట్ల నుంచి వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు నిర్వచనం, ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేస్తూ ముగింపు రాయాలి.
  • సెక్షన్-బిలోని లఘు సమాధాన ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ వర్తకం, వ్యాపార ప్రకటనలు, కంప్యూటర్ అవగాహన లేదా వ్యాపార సేవల యూనిట్ల నుంచి వస్తాయి. ఈ సెక్షన్‌లో పూర్తి మార్కులు పొందేందుకు ఎక్కువ అవకాశం ఉన్నందున నిర్వచనంతో పాటు ప్రశ్నకు సంబంధించిన ప్రత్యక్ష సమాధానాలను విపులంగా రాయాలి.
  • సెక్షన్-సిలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, వివరంగా సమాధానాలు రాసి పూర్తి మార్కులు పొందొచ్చు.
పార్ట్- 2 అకౌంట్స్- 50 మార్కులు
విభాగం మార్కులు సమయం
సెక్షన్-డి 1 ణ 20 = 20 30 నిమిషాలు
సెక్షన్-ఇ 1 ణ 10 = 10 20 నిమిషాలు
సెక్షన్-ఎఫ్ 2 ణ 5 = 10 20 నిమిషాలు
సెక్షన్-జి 5 ణ 2 = 10 20 నిమిషాలు
  • సెక్షన్-డిలో భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించి 20 మార్కుల ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం సుదీర్ఘంగా ఉండటం వల్ల సంబంధిత పట్టికల్లో జాగ్రత్తగా వ్యవహారాలను నమోదు చేస్తూ సరైన పద్ధతిలో ఖాతాల నిల్వల్ని తేల్చాలి. సమయం వృథా కాకుండా చూసుకోవాలి.
  • సెక్షన్-ఇలో కన్‌సైన్‌మెంట్ ఖాతాలు, వ్యాపారేతర సంస్థల ఖాతాల నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిని బాగా చదివి, అర్థం చేసుకొని ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని అవసరమైన మేరకు మాత్రమే సమాధానం రాయాలి.
  • సెక్షన్-ఎఫ్‌లోని నాలుగు ప్రశ్నల్లో 3 అకౌంట్స్ ప్రశ్నలు, 1 థియరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. విద్యార్థులు వారికి అనువైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి.
  • సెక్షన్-జిలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, సవివరంగా సమాధానాలు రాయాలి.
సూచనలు:
  • అకౌంట్స్ విభాగంలో అధిక శాతం సుదీర్ఘ సమాధాన ప్రశ్నలు, calculations ఉన్నందున సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం.
  • అకౌంట్స్‌లో నియమాలు, సూత్రాలను అనుసరిస్తూ సమాధానాలు రాయాలి. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్ ఉపయోగించాలి.
ఎకనామిక్స్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, ఆర్థిక సమస్యలు- కారణాలు, నివారణ చర్యలు, గణాంక వివరాలను కూలంకషంగా చదివి, అర్థం చేసుకుంటే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది.

సిలబస్:
యూనిట్ 1: ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి.
యూనిట్ 2: నూతన ఆర్థిక సంస్కరణలు.
యూనిట్ 3: జనాభా, మానవ వనరుల అభివృద్ధి.
యూనిట్ 4: జాతీయాదాయం.
యూనిట్ 5: వ్యవసాయ రంగం.
యూనిట్ 6: పారిశ్రామిక రంగం.
యూనిట్ 7: తృతీయ రంగం.
యూనిట్ 8: ప్రణాళికలు.
యూనిట్ 9: పర్యావరణం, ఆర్థికాభివృద్ధి.
యూనిట్10: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ- విహంగ వీక్షణం.

ప్రశ్నపత్రం:
  • సెక్షన్- ఎలోని ఐదు ప్రశ్నల్లో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
  • సెక్షన్- బిలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు.
  • సెక్షన్- సిలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
మార్కుల వెయిటేజీ:
యూనిట్ 10 మార్కులు 5 మార్కులు 2 మార్కులు
1 1 - 2
2 1 2 2
3 1 1 2
4 1 2 -
5 1 2 4
6 1 2 2
7 - 2 3
8 - 1 3
9 - 1 3
10 - 1 -
  • పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నకు రెండు నిమిషాలు కేటాయించాలి. పునఃపరిశీలనకు 10 నిమిషాలు కేటాయించాలి.
సూచనలు:
  • అర్థశాస్త్రం సిలబస్‌లో జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాల నుంచి దాదాపు 80 నుంచి 90 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.
  • ప్రతి సమాధానంలో సబ్ హెడ్డింగ్స్, గణాంకాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది.
  • 10 మార్కుల ప్రశ్నకు కనీసం 8 కారణాలు, ఆరు నివారణ చర్యలు రాయాలి. 5 మార్కుల ప్రశ్నకు ఐదారు అంశాలు రాయాలి.
  • పరీక్షలో తొలుత రెండు మార్కుల ప్రశ్నలకు, తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, చివరగా 10 మార్కుల ప్రశ్న లకు సమాధానాలు రాయాలి.
మ్యాథమెటిక్స్
Inter 2-ఎలో విస్తరణ కొలతలకు సంబంధించిన దీర్ఘ సమాధాన ప్రశ్నకు సమాధానం రాసేందుకు సంవర్గమానాలను ఉపయోగించడం తెలుసుకోవాలి.


ఎకనామిక్స్
Inter జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.



కామర్స్
Inter ‘అకౌంట్స్’ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం.

prepared by
K. Janardhan Reddy (Economics)
Kuruhuri Ramesh (Commerce)
S.S.C.V.S. Ramarao (Mathematics)
Royal Educational Institutions,
Hyderabad.
Published date : 10 Oct 2013 04:08PM

Photo Stories