Skip to main content

మెరుగైన మార్కులకు మార్గాలు..

ఇంటర్ బైపీసీ ప్రిపరేషన్ ప్లాన్
Bavithaఇంటర్మీడియెట్‌లో చూపిన ప్రతిభ భవిష్యత్తులో సుస్థిర కెరీర్‌కు బాటలు వేస్తుంది. ఇంటర్ పరీక్షల ప్రారంభానికి దాదాపు 100 రోజులు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బైపీసీలో అత్యధిక మార్కులు సాధించేందుకు సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న ప్రిపరేషన్ ప్లాన్...


జువాలజీ
ఫస్టియర్
ఎంసెట్ మెడికల్ విభాగంలో ఇంటర్ వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచి మొదలు పెట్టి మార్చిలో జరిగే పరీక్షల వరకు ఎలా చదివితే గరిష్ట ప్రయోజనం లభిస్తుందో ఎవరికి వారు ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ సంవత్సరం సిలబస్‌లో 8 యూనిట్లున్నాయి. వీటి ప్రాధాన్యత ఇలా ఉంటుంది.

యూనిట్ 1: జీవ ప్రపంచ వైవిధ్యం - 6 మార్కులు;
యూనిట్ 2: జంతుదేహ నిర్మాణం - 10 మార్కులు;
యూనిట్ 3: జంతు వైవిధ్యం (1) - 6 మార్కులు;
యూనిట్ 4: జంతు వైవిధ్యం (2) - 6 మార్కులు;
యూనిట్ 5: గమనం, ప్రత్యుత్పత్తి - 8 మార్కులు;
యూనిట్ 6: మానవ సంక్షేమంలో జీవశాస్త్రం -14 మార్కులు;
యూనిట్ 7: బొద్దింక- 12 మార్కులు;
యూనిట్ 8: జీవావరణం, పర్యావరణం-14 మార్కులు.

  • విద్యార్థులు ఈపాటికే చాలా వరకు సిలబస్‌ను పూర్తిచేసి ఉండాలి. ప్రిపరేషన్‌కు ఈ వంద రోజులు చాలా కీలకమైనవి. ఇంటర్ వార్షిక పరీక్షలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి.
పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు:
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు: మూడు విభాగాల్లోనూ ఇది అతి ముఖ్యమైంది. దీంట్లో చాయిస్ ఉండదు. గరిష్ట మార్కులు పొందడానికి ఈ విభాగం మంచి అవకాశం. అందువల్ల అకాడమీ పాఠ్యపుస్తకంలో ప్రతి యూనిట్ చివర ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్నంగా చదవాలి. వారానికి ఒక యూనిట్ చొప్పున సాధన చేయాలి. ఇది భవిష్యత్తులో ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ఈ విభాగానికి గరిష్టంగా 24 మార్కులు కేటాయించారు. కొన్ని ప్రశ్నలకు బాగా పటాలు గీయాల్సిన అవసరం ఉంది. అందువల్ల విద్యార్థులు అవసరమైన పటాలను చాలాసార్లు సాధన చేయాలి. వారానికి కొన్ని పటాలు చొప్పున ప్రాక్టీస్ చేయాలి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు:
  • 6, 7, 8 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
  • పరాన్న జీవుల జీవితచక్రాలు, బొద్దింక, జీవావరణం, పర్యావరణం యూనిట్ల నుంచి ఈ రకమైన ప్రశ్నలు ఇస్తారు. దాదాపు 12 ప్రశ్నలకు సమాధానాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సమయపాలన కచ్చితంగా పాటించాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల్ని పరిచయం, వివరణ, సబ్ హెడ్డింగ్స్ రూపంలో సాధన చేయాలి.
సెకండియర్
ప్రస్తుతం సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు.. ఆ తర్వాత పోటీ పరీక్షలు వరుసగా ఉంటాయి. కాబట్టి వారికి ఇప్పటి నుంచి అన్ని పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతి నిమిషం విలువైనదే. ద్వితీయ సంవత్సరం సిలబస్‌లో 8 యూనిట్లున్నాయి.
పాఠ్యాంశాలు - వెయిటేజ్
యూనిట్ 1:
మానవ జీర్ణక్రియ, శోషణం, శ్వాసించడం, వాయువుల వినిమయం- 8 మార్కులు.
యూనిట్ 2: శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక
పదార్థాలు- విసర్జన- 10 మార్కులు. యూనిట్ 3: కండర, అిస్థిపంజర వ్యవస్థ, నాడీ నియంత్రణ- సమన్వయం- 10 మార్కులు.
యూనిట్ 4: అంతస్స్రావక వ్యవస్థ, రసాయన సమన్వ యం,రోగ నిరోధక వ్యవస్థ-10 మార్కులు.
యూనిట్ 5: మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం- 12 మార్కులు.
యూనిట్ 6: జన్యుశాస్త్రం- 12 మార్కులు.
యూనిట్ 7: జీవపరిణామం- 8 మార్కులు.
యూనిట్ 8: అనువర్తిత జీవశాస్త్రం- 8 మార్కులు.
    Bavitha
  • విద్యార్థులు ప్రయోగపరీక్షలకు రికార్డులను సిద్ధం చేసుకోవడంతో పాటు థియరీ పరీక్షలకు సన్నద్ధం కావాలి.
  • జనవరి చివరిలోగా సిలబస్‌ను ఒకసారైనా పూర్తిచేయాలి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌కు ప్రిపేర్ కావాలి. తర్వాత ఇంటర్ వార్షిక పరీక్షలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి.
సిలబస్‌లో మానవ శరీర నిర్మాణ శాస్త్రం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు సంబంధించిన అంశాలు 5 యూనిట్లలో ఉన్నాయి.
- కె. శ్రీనివాసులు,
శ్రీచైతన్య విద్యాసంస్థలు.

బోటనీ
ఫస్టియర్
‘తెలుగు అకాడమీ’తో మేలు: బోటనీకి సంబంధించి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చదవటం చాలా ముఖ్యం. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ఒక వరుసక్రమాన్ని పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముందు చదివిన అంశాలు.. తర్వాత పాఠాలు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఉపయోగపడతాయి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా వెయిటేజీని అంచనా వేసుకొని చదవాలి. దీనివల్ల ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలో తెలుస్తుంది.

పాఠ్యాంశాలు-వెయిటేజీ:
యూనిట్ 1:
జీవ ప్రపంచంలో వైవిధ్యం (14 మార్కులు)
యూనిట్ 2: మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మార్కులు)
యూనిట్ 3: మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు)
యూనిట్ 4: ప్లాంట్ సిస్టమాటిక్స్ (6 మార్కులు)
యూనిట్ 5: కణ నిర్మాణం, విధులు (14 మార్కులు)
యూనిట్ 6: మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (12 మార్కులు)
యూనిట్ 7: వృక్ష ఆవరణ శాస్త్రం (6 మార్కులు)
    Bavitha
  • ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చిత్రపటాలను వేగంగా గీయటం నేర్చుకోవాలి.
  • ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. చేతిరాతను మెరుగుపరచుకోవాలి.
2, 3, 6 యూనిట్‌ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి.

సెకండియర్
మొదటి సంవత్సర వార్షిక పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. అందువల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను చదివిన తర్వాత ప్రతి పాఠం చివర ఉన్న ప్రశ్నలకు పరీక్షలకు అవసరమయ్యే విధంగా సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది.

పాఠ్యాంశాలు- వెయిటేజీ:
యూనిట్ 1:
మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు);
యూనిట్ 2: సూక్ష్మజీవ శాస్త్రం (6 మార్కులు);
యూనిట్ 3: జన్యుశాస్త్రం (6 మార్కులు);
యూనిట్ 4: అణు జీవశాస్త్రం (8 మార్కులు);
యూనిట్ 5: బయోటెక్నాలజీ (16 మార్కులు);
యూనిట్ 6: ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు).
  • 1, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 4, 5 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి.
  • మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి.
-బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

ఫిజిక్స్
ఫస్టియర్
జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా భయపడే సబ్జెక్టు ఫిజిక్స్. అందువల్ల దీనిపై తొలుత ఇష్టం పెంచుకొని, శ్రద్ధతో చదవడాన్ని అలవాటు చేసుకోవాలి.

ముఖ్యమైన చాప్టర్లు:
  • సింపుల్ హార్మోనిక్ మోషన్; రొటేటరీ మోషన్; కైనమాటిక్స్; వెక్టార్స్; కైనటిక్ గ్యాస్ థియరీ; గ్యాస్, లిక్విడ్, సాలిడ్ వ్యాపనాలు. వెక్టార్స్‌లోని భౌతిక సిద్ధాంతాలను చదవడం ద్వారా ఆ చాప్టర్‌పై పట్టు సాధించవచ్చు. రొటేటరీ మోషన్, యాంగులర్ మూవ్‌మెంట్, పొజిషన్ వెక్టార్, యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అతి ముఖ్యమైనవి.
  • సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో టైం ఫేజ్, సమస్యల సాధనలో దాని ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • సర్ఫేస్ టెన్షన్‌లో నిత్య జీవితంలో దాని ఉపయోగాలు, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, కేపిలారిటీ- దాని ఉపయోగాలను చదవాలి.
  • థర్మో డైనమిక్స్‌లో జౌల్స్ లా, హీట్ కాలిక్యులేషన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమీటర్, అడియాబాటిక్, ఐసోథర్మల్ ఛేంజెస్ మొదలైన వాటిని బాగా చదవాలి.
సెకండియర్
ఫస్టియర్‌తో పోల్చితే సెకండియర్ ఫిజిక్స్ కొంత కష్టమని విద్యార్థులు భావిస్తారు. అయితే ప్రణాళిక ప్రకారం చదివితే సెకండియర్ ఫిజిక్స్‌లోనూ అధిక మార్కులు తెచ్చుకోవచ్చు.

పాఠ్యాంశాలు- వెయిటేజీ/అంచనా:
వేవ్స్- 6 మార్కులు;
రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్- 8 మార్కులు;
కరెంట్ ఎలక్ట్రిసిటీ- 10 మార్కులు;
మూవింగ్ ఛార్జెస్ అండ్ మాగ్నటిజం- 14 మార్కులు;
పరమాణువు- 8 మార్కులు; కేంద్రకం- 6 మార్కులు;
సెమీ కండక్టర్ పరికరాలు- 6 మార్కులు.
  • దీర్ఘ సమాధాన ప్రశ్నలకు ముఖ్యమైన అంశాలు: వేవ్ మోషన్; కేంద్రకం;సెమీ కండక్టర్ పరికరాలు; మూవిం గ్ ఛార్జెస్- మాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ.
  • స్వల్ప సమాధాన ప్రశ్నలకు ముఖ్యమైనవి: సెమీ కండక్టర్ పరికరాలు; కరెంట్ ఎలక్ట్రిసిటీ; అయస్కాంతత్వం; ఎలక్ట్రిక్ పొటెన్షియల్, రే ఆప్టిక్స్; డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్.
కెమిస్ట్రీ
ఫస్టియర్
కెమిస్ట్రీలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు ప్రధానంగా రసాయన బంధం, పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం నుంచి వస్తాయి.కాబట్టి వీటికి అధిక సమయం కేటాయించాలి. కెమిస్ట్రీలో ఎక్కువగా అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలో రోజుకో చాప్టర్ చదువుతూ ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేస్తూ నోట్స్ తయారు చేసుకోవాలి. పాఠం చివర ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి.
  • కర్బన రసాయన శాస్త్రం, బోర్న్ హేబర్ వలయం, హైడ్రోజన్ స్పెక్ట్రం, అయనైజేషన్ పొటెన్షియల్, పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. కర్బన రసాయన శాస్త్రంలో నేమ్డ్ రియాక్షన్స్, ప్రాపర్టీస్ అంశాలను బాగా చదవాలి.
  • జనరల్ కెమిస్ట్రీలోని Stoichiometry, ఫిజికల్ కెమిస్ట్రీలోనిStoichiometry,కెమికల్ కైనటిక్స్, ఎనర్జిటిక్స్‌లోని కాన్సెప్టులను నేర్చుకొని, సమస్యలన్నింటినీ సాధన చేయాలి.
  • Stoichiometry, అటామిక్ స్ట్రక్చర్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిల్లో ఉండే సమస్యలను సాధన చేయ డంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకోవాలి.
సెకండియర్
కెమిస్ట్రీలో 60కి 60 మార్కులు తెచ్చుకోవాలంటే మొదట తెలుగు అకాడమీ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. చాప్టర్ల చివర ఇచ్చిన ఉదాహరణలు, ప్రశ్నలను బాగా చదవాలి. ఇప్పటి నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కు ల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ముఖ్యంగా విద్యుత్ రసాయనిక శాస్త్రం; కెమికల్ కెనైటిక్స్; పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఇ, ఏ, ై కలిగిన ఆర్గానిక్ పదార్థాల చాప్టర్ల లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు చదవాలి. ఆర్గానిక్ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తప్పనిసరిగా పేపర్‌పై రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. జనవరిలో ముఖ్యమైన లఘు సమాధా న, నాలుగు మార్కుల ప్రశ్నలపై శ్రద్ధచూపాలి. ఫిబ్రవరి, మార్చిలో అప్పటివరకు చదివిన అంశాలను రివిజన్ చేయాలి.

పాఠ్యాంశాలు- వెయిటేజీ/అంచనా:
విద్యుత్ రసాయన శాస్త్రం- 10 మార్కులు;
పి బ్లాక్ మూలకాలు-12 మార్కులు;
డి,ఎఫ్ బ్లాక్ మూలకాలు- 6 మార్కులు;
C, H, O కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 8 మార్కులు;
నైట్రోజన్ కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 4 మార్కులు.

Bavitha అన్ని చాప్టర్లలోని కాన్సెప్టులను ఒంటబట్టించుకొని, సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
-ఎం.ఎన్.రావు.
Published date : 12 Dec 2013 05:29PM

Photo Stories