ఇంజనీరింగ్‌కు మార్గాలు..
Sakshi Education
Engineering Advancements are stepping stones of Nation Building.. ఒక జాతి నిర్మాణంలో ఇంజనీరింగ్‌ది కీలక పాత్ర. అందుకే అందుకునే నేర్పు, ఓర్పు ఉండాలేగానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అపార అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇంటర్ తర్వాత రకరకాల పోటీ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించి, అత్యున్నత కళాశాలలో సీటు సాధిస్తే, మెరుగైన కెరీర్ దిశగా అడుగు వేసినట్లే.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే వివిధ పోటీ పరీక్షలు, ప్రిపరేషన్ వ్యూహాల సమగ్ర సమాచారం...
జేఈఈ అడ్వాన్స్‌డ్
జేఈఈ మెయిన్ రాసిన వారిలో 1.50లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హత కల్పిస్తారు. ఈ విద్యార్థులు మే 4-9 మధ్య ఐఐటీ దరఖాస్తులను పూర్తిచేయాలి.
2014,మే 25న ఆఫ్‌లైన్‌లో జరిగే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాలి. ఇందులో మంచి ర్యాంకు, ఇంటర్‌లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటే ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నిట్‌లు, ఐఐఐటీలు, ఐఐటీలు, కేంద్ర ప్రాయోజిత సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ను జేఈఈ అపెక్స్ బోర్డు నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్‌కు 60 శాతం; స్టేట్ బోర్డులు, సీబీఎస్‌ఈ ఇంటర్‌లో నార్మలైజ్డ్ స్కోర్‌కు 40 శాతం వెయిటేజ్ ఇచ్చి ఉమ్మడి ర్యాంకులను ప్రకటించి, వాటి ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్
జేఈఈ మెయిన్ రాసిన వారిలో 1.50లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హత కల్పిస్తారు. ఈ విద్యార్థులు మే 4-9 మధ్య ఐఐటీ దరఖాస్తులను పూర్తిచేయాలి.
2014,మే 25న ఆఫ్‌లైన్‌లో జరిగే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాలి. ఇందులో మంచి ర్యాంకు, ఇంటర్‌లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటే ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- 2013 జేఈఈ అడ్వాన్స్‌డ్ రెండు పేపర్‌లలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం మార్కులు 360. పరీక్షలో ఏక సమాధాన ప్రశ్నలు, ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్న ఇంటీజర్ టైప్ ప్రశ్నలు, మాట్రిక్స్ మ్యాచింగ్, పారాగ్రాఫ్ టైప్ ప్రశ్నలు వచ్చాయి.
- సబ్జెక్టు పరంగా జనరల్ కేటగిరీ విద్యార్థులకు పది శాతం, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ విద్యార్థులకు 9 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీడీ విద్యార్థులకు 5 శాతం మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. అదే విధంగా మొత్తం మార్కులకు సంబంధించి జనరల్ కేటగిరీ విద్యార్థులకు 35 శాతం, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ విద్యార్థులకు 31.5 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీడీ విద్యార్థులకు 17.5 శాతం మార్కులు కటాఫ్ ఉంటుంది. సబ్జెక్టు పరంగా నాలుగైదు ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తిస్తే కటాఫ్ సాధించవచ్చు.
- ప్రతి సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన, పట్టు సాధించాలి.
- ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలతో పాటు కాలేజీ మెటీరియల్‌ను బాగా చదవాలి.
- పరీక్షకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది కాబట్టి గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
- `ఎన్‌సీఈఆర్‌టీ కెమిస్ట్రీ పుస్తకాల్లోని థియరీ భాగాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకొని,రివిజన్ చేయాలి. ఆర్గానిక్ కెమి స్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంటర్ మార్కులు | పర్సంటైల్ |
998/1000 | 99.99 |
975/1000 | 99.11 |
955/1000 | 95.4 |
940/1000 | 92.16 |
920/1000 | 87.88 |
900/1000 | 83.84 |
885/1000 | 80.9 |
- ఈ ఏడాది 920-930 మార్కులు వచ్చిన వారు టాప్ 20 పర్సంటైల్‌లో ఉండే అవకాశముంది.
- వెబ్‌సైట్: www.jeeadv.iitkgp.ac.in
నిట్‌లు, ఐఐఐటీలు, ఐఐటీలు, కేంద్ర ప్రాయోజిత సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ను జేఈఈ అపెక్స్ బోర్డు నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్‌కు 60 శాతం; స్టేట్ బోర్డులు, సీబీఎస్‌ఈ ఇంటర్‌లో నార్మలైజ్డ్ స్కోర్‌కు 40 శాతం వెయిటేజ్ ఇచ్చి ఉమ్మడి ర్యాంకులను ప్రకటించి, వాటి ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
- జేఈఈ మెయిన్ పేపర్-1, పేపర్-2 పరీక్షల్ని ఆఫ్‌లైన్‌లో ఏప్రిల్ 6, 2014లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో పేపర్-1..ఏప్రిల్ 9, 2014, ఏప్రిల్11, ఏప్రిల్ 12, ఏప్రిల్ 19లో నిర్వహిస్తారు.
- 2012, 2013లో ఇంటర్‌లో ఉత్తీర్ణులైనవారు, 2014లో సీనియర్ ఇంటర్ రాసేవారు పరీక్ష రాసేందుకు అర్హు లు. నవంబర్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2013 జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. నెగిటివ్ మార్కులుంటాయి.
- వెబ్‌సైట్: www.jeemain.nic.in
- సిలబస్ ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాల మేరకు ఉంటుంది. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌లో కూడా ప్రశ్నలుంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలు రాయాలి. ఈ పరీక్షలో వేగం కీలకం. నెగిటివ్ మార్కులుంటాయి.
- 300 కంటే ఎక్కువ మార్కులు వస్తే బిట్స్‌లో సీటు వస్తుంది కాబట్టి మూడు గంటల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఆన్‌లైన్ పరీక్షల్ని ప్రాక్టీస్ చేయాలి.
- 2013లో ఇంటర్ పూర్తయిన వారు, 2014లో సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు బిట్‌శాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 60 శాతం చొప్పున మార్కులు, మొత్తంమీద 75శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇతర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలతో పోల్చితే ఎదుర య్యే విభిన్నమైన విభాగం లాజికల్ రీజనింగ్. ఇందుకోసం బొమ్మల చిత్రీకరణ,అనాలజీ, లాజికల్ డిడక్షన్, నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్‌లపై పట్టు సాధించాలి.
- ప్రాథమిక ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువగా సినానిమ్స్, యాంటానిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్/ఫార్మేషన్, టెన్సెస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, జంబుల్డ్ వర్డ్స్‌పై దృష్టి సారించాలి. గ్రామర్‌లోని ప్రాథమిక అంశాలన్నింటిపైనా పట్టు సాధించాలి.
- వెబ్‌సైట్: www.bitsadmission.com
- ఇతర ఎంట్రెన్స్‌లతో పోలిస్తే ఎంసెట్‌కు సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు పరీక్షలో వేగం కూడా ముఖ్యం. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లతో పోలిస్తే ఎంసెట్‌లో దాదాపు రెట్టింపు ప్రశ్నలుంటాయి. అందువల్ల వీలైనన్ని ఎక్కువ వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి.
- కాలేజీ మెటీరియల్‌తో పాటు తెలుగు అకాడ మీ పుస్తకాలను బాగా చదివితే 160 మార్కులకుగాను 110మార్కులకు పైగా సాధించవచ్చు.
- ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రశ్నపత్రంలో మ్యా థమెటిక్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ప్ర శ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగిటివ్ మార్కులుండవు. ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రశ్న ప్రతంలో ఇచ్చే 160 ప్రశ్నల్లో 70శాతం ప్రశ్నలు సులభంగా లేదా మధ్యస్థంగా ఉంటాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీ య సంవత్సరాల సిలబస్‌కు సమాన ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం ప్రశ్నలకు 3 గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
- విట్‌లో సంపూర్ణ సరళీకృత క్రెడిట్ విధానంలో (ఎఫ్‌ఎఫ్‌సీఎస్) బోధన జరుగుతోంది. దీని ప్రకారం ఒక సెమిస్టర్లో తక్కువ కోర్సులను, మరొక దాంట్లో ఎక్కువ కోర్సులను, మిగిలిన వాటిని వేసవి సెలవుల్లో పూర్తిచేయవచ్చు.
- బీటెక్‌తో పాటు ఎంబీఏ కూడా చదివేందుకు విట్ అవకాశం కల్పిస్తోంది.
- విట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్‌లోని కొంత భాగం నుంచి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌లోని ఎక్కువ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున మొత్తం 120 ప్రశ్నలుంటాయి. వీటికి రెండున్నర గంటల్లో సమాధానాలు రాయాలి. నెగిటివ్ మార్కులుండవు.
- విట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్- 2014, ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 4 నుంచి ప్రారంభమవుతుంది.
- విట్‌లో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు 95% నుంచి 100 శాతం వరకు ప్లేస్‌మెంట్స్ అందుబాటులో ఉంటున్నాయి.
వెబ్‌సైట్: www.vit.ac.in
- ఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ జరుగుతుంది. పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 35 చొప్పున మొత్తం 105 ప్రశ్నలుంటా యి. ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, తప్పు సమాధానానికి-1 మార్కు ఉంటుంది.
- పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలుంటాయి కాబట్టి ఎంసెట్ ముగిశాక ఆన్‌లైన్ పరీక్ష తేదీని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.
- ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, జేఈఈ మెయిన్ ముగిశాక ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్‌లపై దృష్టిపెడితే మణిపాల్ పరీక్షతో పాటు బిట్‌శాట్‌కు కూడా ఉపయోగంగా ఉంటుంది.
- తమిళనాడులోని అన్ని సంస్థల పరీక్షలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటికి భిన్నంగా అమృత పరీక్షలో 50 మ్యాథమెటిక్స్ ప్రశ్నలుంటాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్ బాగా చేస్తారు కాబట్టి ఇక్కడి విద్యార్థులకు కలిసొచ్చే పరీక్షని చెప్పొచ్చు.
- అమృత విద్యాసంస్థకు మూడు చోట్ల క్యాంపస్‌లున్నాయి. అవి: కోయంబత్తూరు, అమృత్‌పురి (కేరళ), బెంగళూరు. ఈ క్యాంపస్‌ల్లో బీటెక్‌లో ప్రవేశానికి 2014, ఏప్రిల్ 13న పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఆఫ్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. రాష్ట్రంలోని మంచి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు రానివారు, రాష్ట్రానికి వెలుపల చదవాలనుకునే వారు ఈ పరీక్ష రాయొచ్చు. పరీక్షలో నెగిటివ్ మార్కులుంటాయి.
- అమృత పరీక్షలో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 35, కెమిస్ట్రీ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులుంటాయి.
- డిసెంబరు 16 నుంచి దరఖాస్తులు లభిస్తాయి.
- సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా రెండు, అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి.
- గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే చాలా వరకు సులభమైన ప్రశ్నలు వచ్చాయి. ఎంసెట్‌తో పోల్చితే ఇందులో కొంత ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది కాబట్టి కచ్చితమైన ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
- పరీక్ష రాసేటప్పుడు ఏ ప్రశ్నలకు నెగటివ్ మార్కులున్నాయి? వేటికి లేవు? అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మెయిన్‌లో ప్రాధాన్యమున్న సబ్జెక్టులకే అడ్వాన్స్‌డ్‌లోనూ ప్రాధాన్యం ఉంది.
- గతేడాది ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే క్లిష్టంగా ఉండే ప్రశ్నలు దాదాపు 40 శాతం వరకు ఉన్నాయి. మెయిన్ పరీక్ష పూర్తయ్యాక అందుబాటులో ఉన్న సమయంలో అధ్యాపకుల సహాయంతో అన్ని అధ్యాయాల్లోని అంశాలనూ పునశ్చరణ చేయాలి.
- గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి.
- సీనియర్ ఇంటర్ ఫిజిక్స్‌లో కిర్కాఫ్ నియమాలు; ఫ్లెమింగ్ ఎడమ, కుడిచేయి సూత్రాలు; అర్ధ వాహక పరికరాలు; ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని మూల సిద్ధాంతాలను, సమీకరణాలను పట్టిక రూపంలో పొందుపరచుకొని ప్రాక్టీస్ చేస్త్తే ఎంత కష్టమైన పాఠ్యాంశాన్నయినా ఇష్టంగా చదవచ్చు.
- ఎంసెట్‌లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిపై దృష్టిసారించాలి. ఫార్ములా ఆధారిత థియరీ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
- వీలైనన్ని ప్రీవియస్, నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. చీలికల ప్రయోగం; ఫిజికల్ ఆప్టిక్స్ వంటి చిన్న యూనిట్లపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
- జేఈఈ మెయిన్‌లోని 30 ప్రశ్నలకు గంటలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి కాన్సెప్టులు, వాటి అనువర్తనాలను క్షుణ్నంగా నేర్చుకుని.. అధిక మోడల్ పేపర్లను సాధన చేయాలి.
- జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఇచ్చే ప్రశ్నలు విభిన్నంగా ఉంటాయి. అందువల్ల బలహీనంగా ఉన్న అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించి, వాటిపై పట్టుసాధించాలి.
- అడ్వాన్స్‌డ్‌కు మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, మెకానిక్స్ అంశాలపై పట్టుసాధించాలి. దీనికోసం 15-20 గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. తర్వాత తప్పులను సరిచూసుకోవాలి. ఇలా చేస్తే మంచి ర్యాంకు తెచ్చుకోవచ్చు.
- ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలు.
- హెచ్.సి.వర్మ- ఫిజిక్స్.
- కెమిస్ట్రీలోని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ విభాగాల్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కీలకమైంది. ఇందులోని చాలా అంశాలు అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతిచర్యల క్రమం, ఫ్లోచార్ట్స్, మూలకాలు-తయారీ పద్ధతులు-ధర్మాలను వరుస క్రమంలో రివిజన్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆల్కహాల్స్, ఎమైన్స్, ఫినోల్స్, నేమ్డ్ రియాక్షన్స్ చాప్టర్లలోని ఆర్డర్ ఆఫ్ యాసిడ్స్, బేసిక్ స్ట్రెంగ్త్ అంశాలను సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్, ఇంటర్ కన్వర్షన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయాలి.
- ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం ఫార్ములాల ఆధారంగా ఉంటుంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, సాలిడ్ స్టేట్, కెమికల్ కైన మెటిక్స్, ఈక్విలిబ్రియుం వంటి అంశాల నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు రావచ్చు. మ్యాథమెటిక్స్, న్యూమరికల్స్ సంబంధితంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 40 శాతం, ఆర్గానిక్ నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఈ విభాగాలను ప్రాధాన్యతా క్రమంలో చదవాలి. భౌతిక రసాయన శాస్త్రంలో ప్రతి చాప్టర్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సమతాస్థితి, విద్యుత్ రసాయన శాస్త్రం, థర్మో కెమిస్ట్రీ, ద్రావణాల్లోని collegative ప్రాపర్టీస్, ఘనస్థితి వంటి చాప్టర్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- విద్యార్థులు సానుకూల ధోరణిని అలవరచుకొని, లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలి.
- ప్రిపరేషన్‌లో లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి.
- ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ప్రాక్టీస్‌కు లొంగనిది ఏదీ ఉండదనే విషయాన్ని గుర్తించాలి.
- వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తూ, ప్రాక్టీస్ టెస్ట్‌లు ఎక్కువగా రాయాలి. టైం మేనేజ్‌మెంట్‌ను అలవరచుకొని, స్వీయ క్రమశిక్షణతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
- ఏ పరీక్షలోనైనా 30- 40 శాతం కష్టతరమైన, 25 శాతం సులభమైన, మిగిలినవి మధ్యస్థాయి కాఠిన్యతతో ఉంటాయని భావించి ప్రిపరేషన్ కొనసాగించాలి.
కోర్సు | పేపర్ | సబ్జెక్టులు | వ్యవధి |
బీఈ/బీటెక్ | పేపర్-1 | ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ | 3 గం. |
జేఈఈ మెయిన్ (2013) కటాఫ్
2013 జేఈఈ మెయిన్ నుంచి 1,50,000 మంది విద్యార్థులు ఈ కింది కటాఫ్ ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు.
కేటగిరీ | మొత్తం మార్కులు 360 |
కామన్ మెరిట్ లిస్ట్ | 113 |
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) | 70 |
ఎస్సీ | 50 |
ఎస్టీ | 40 |
బీఈ/బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ఐఐటీ లు, నిట్‌ల తర్వాత బిట్స్‌కు ప్రాధాన్యం ఇస్తారనడంలో సందేహం లేదు. బిట్స్-హైదరాబాద్; బిట్స్-గోవా; బిట్స్ - పిలానీ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి బిట్‌శాట్‌ను నిర్వహిస్తారు. పరీక్షలు 2014,మే మూడో వారంలో ప్రారంభమవుతాయి.
విభాగం | ప్రశ్నలు 360 | మార్కులు |
ఫిజిక్స్ | 40 | 120 |
కెమిస్ట్రీ | 40 | 120 |
మ్యాథ్స్ | 45 | 135 |
ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ | 15 | 45 |
లాజికల్ రీజనింగ్ | 10 | 30 |
మొత్తం | 150 | 450 |
బిట్‌శాట్-2013 కటాఫ్
బ్రాంచ్ | హైదరాబాద్ | గోవా | పిలాని |
కంప్యూటర్ సైన్స్ | 316 | 323 | 354 |
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ | 300 | 305 | 343 |
మెకానికల్ | 299 | 300 | 337 |
సివిల్ | 290 | - | 308 |
ప్రిపరేషన్:
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీసీ విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష ఎంసెట్. ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులందరూ ఈ పరీక్ష రాస్తారు. రాష్ట్రంలోని టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలు.. బోధనా విధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్ల విషయాల్లో నిట్, ఐఐటీలతో పోటీపడుతున్నాయి కాబట్టి వాటిలో సీటు సంపాదించేందుకు ప్రయత్నించాలి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్; ఐఐఐటీ- అలహాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్- తిరువనంతపురంలో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. వీటికి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడతాయి. వాటిలోని మార్గదర్శకాల ప్రకారం జేఈఈ మెయిన్ హాల్‌టికెట్ నంబర్, మార్కులను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవాలి. ఐఐటీలు, నిట్‌ల తర్వాత ఈ సంస్థలు ప్రముఖమైనవి.
విట్- ఎంట్రెన్స్
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్).. తమిళనాడులోని ప్రముఖ విద్యాసంస్థ. దీనికి అంతర్జాతీయ అక్రిడిటేషన్ ఉంది. వెల్లూర్, చెన్నైల్లో విట్ క్యాంపస్‌లున్నాయి.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇందులో ఇంజనీరింగ్ కోర్సులోకి ప్రవేశాలకు ఎస్‌ఆర్‌ఎంఈఈ-2014 జరగనుంది. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పొందొచ్చు. లేదా యాక్సిస్ బ్యాంక్, విజయా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌ల నుంచి తీసుకోవచ్చు.
దరఖాస్తు:నవంబర్ 3 వారం నుంచి.
ఆఫ్‌లైన్ పరీక్ష: 2014, ఏప్రిల్ 27 (ఉదయం 10- 12.30).
ఆన్‌లైన్ పరీక్ష: 2014, ఏప్రిల్ 17- ఏప్రిల్ 22 (రెండు సెషన్లు).
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
మణిపాల్ ఎంట్రెన్స్
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (కఅఏఉ) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ పరీక్షను ఆన్‌లైన్లో మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్ష సెషన్‌స ఏప్రిల్‌లో ప్రారంభమవు తాయి. ఇంటర్ సెకండియర్ సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఎంసెట్‌తో పోలిస్తే చాలా సులభంగా ఉంటుంది.
అమృత
తమిళనాడులోని ప్రముఖ విద్యాసంస్థ.. అమృత విశ్వ విద్యాపీఠం (అమృత విశ్వవిద్యాలయం). రాష్ట్రానికి చెందిన చాలా మంది విద్యార్థులు అమృత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాస్తారు.
ప్రిపరేషన్ ప్రణాళిక
మ్యాథమెటిక్స్
జేఈఈ మెయిన్:
ఐపీఈ పరీక్షల తర్వాత చాలా తక్కువ వ్యవధిలో జేఈఈ మెయిన్ పరీక్ష ఉంటుంది. అందువల్ల మొత్తం సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. ఈ పరీక్ష సిలబస్‌కు, ఎంసెట్ సిలబస్‌కు కొంత తేడా ఉంది. దీన్ని గమనించి ప్రాధాన్యత గల చాప్టర్లను బాగా చదవాలి. జేఈఈ మెయిన్‌లో గంటలో 30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. అందువల్ల ఎన్ని ప్రశ్నలకు సమాధానాల్ని గుర్తించామనే కన్నా ఎన్నింటికి కచ్చితమైన సమాధానాలు గుర్తించామన్నదే ముఖ్యం.
మిగిలిన పరీక్షలతో పోలిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్ కొంత భిన్నమైనది. ఇందులో కాన్సెప్ట్‌ల ఆధారిత ప్రశ్నలు వస్తాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్.. మెయిన్ సిలబస్‌ను పోలి ఉంటుంది. కానీ, ప్రశ్నలు ఇచ్చే విధానంలో తేడా ఎక్కువగా ఉంటుంది.
ఎంసెట్ ప్రిపరేషన్‌లో భాగంగా ఒక్కో యూనిట్‌కు ఎం త సమయం అవసరమవుతుందో చూసుకుని ప్రణాళిక వేసుకోవాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఐపీఈ ప్రిపరేషన్‌తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలాచేస్తే ఐపీఈ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది. ఎంసెట్‌లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫార్ములాలు, కాన్సెప్టులపై పట్టు సాధించాలి.
ఎంసెట్:
ఎంసెట్‌లో నెగిటివ్ మార్కులు ఉండవు. ఎంసెట్ ఫిజిక్స్‌కు సంబంధించి మూలసూత్రాలను టేబుల్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయాలి. మొదటి ఏడాది సిలబస్‌లోని ముఖ్యమైన మూలసూత్రాలైన శక్తి, ద్రవ్యవేగ, కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాలపై అవగాహన పెంపొందించుకొని, వాటిని ఏ సందర్భాల్లో అనువర్తించాలో తెలుసుకోవాలి. సరళ హరాత్మక చలనం (ఎస్‌హెచ్‌ఎం)లో లఘు లోలక డోలనావర్తన కాలాన్ని, వాటి అనువర్తనాలను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి.
ఘర్షణ, దృశాశాస్త్రం, భ్రమణ చలనం, ఉష్ణగతిక శాస్త్రం, ఆధునిక భౌతిక శాస్త్రం వంటి పాఠ్యాంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.
పాఠ్యాంశం | ప్రశ్నల సంఖ్య |
మెకానిక్స్ | 7 |
హీట్ ట్రాన్స్‌ఫర్ | 1 |
కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ | 1 |
మోడర్న్ ఫిజిక్స్ | 5 |
ఆప్టిక్స్ | 4 |
ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్ | 3 |
ఎలక్ట్రో డైనమిక్స్ | 9 |
ఎంసెట్:
ఎంసెట్ కెమిస్ట్రీలో ఇంటర్ సెకండియర్ నుంచి 20- 23 ప్రశ్నలు వస్తున్నాయి. మెడికల్ విభాగంతో పోల్చితే ఇంజనీరింగ్‌లో సమస్యల ఆధారిత ప్రశ్నలు నాలుగైదు ఎక్కువ ఉంటాయి.
ఆర్గానిక్ అంశాలను ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే అంత మంచిది. రసాయన సమ్మేళనాల ధర్మాలు, సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియూడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్, స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్/గ్యాసెస్, సొల్యూషన్స్, స్టైకోమెట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, పి బ్లాక్ ఎలిమెంట్స్- గ్రూపు 13-17, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రో కార్బన్స్, థర్మోడైనమిక్స్, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రో కార్బన్స్, హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరేన్స్, ఆల్కహాల్స్/ ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్.
జేఈఈ: ఫార్ములాలు, కాన్సెప్టులపై అవగాహన ఉంటే మెయిన్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌లోనూ ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
రిఫరెన్స్: ఎన్‌సీఈఆర్‌టీ 11,12 తరగతి పుస్తకాలు,ఫిజికల్ కెమిస్ట్రీ-పి.బహదూర్; ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఆర్.జె.మారిసన్
.
సక్సెస్ టిప్స్
.
సక్సెస్ టిప్స్
Published date : 06 Dec 2013 02:26PM