Skip to main content

ఐపీఈ+ ఎంసెట్ + జేఈఈ

అభిరుచికి తగ్గ ఉన్నత విద్యావకాశాల్ని అందుకోవాలన్నా, అరుదైన కోర్సులతో అందమైన కెరీర్‌ను సొంతం చేసుకోవాలన్నా ఇంటర్మీడియెట్ విద్య తొలి మైలురాయి.
Bavithaఇందులో చూపిన ప్రతిభ, భవితకు భరోసా ఇస్తుంది. ఇప్పటి నుంచే పబ్లిక్ పరీక్షలతో పాటు ఎంసెట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక కథనం...

ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థులకు వచ్చే తొమ్మిది నెలల సమయం చాలా ముఖ్యమైంది. ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఇంటర్మీడియెట్ పరీక్షలతో పాటు ఎంసెట్, జేఈఈ తదితర పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలి. ఐఐటీలు, నిట్‌లు, ఉన్నత ఇంజనీరింగ్ కళాశాలల్లో సీటు దక్కించుకోవాలంటే మరింత శ్రమించాలి.

ఆబ్జెక్టివ్ కోణంలో:
2015, సెప్టెంబరు నుంచి 2016, జనవరి 20 వరకు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌పై (ఐపీఈతో పాటు) ఎక్కువగా దృష్టిసారించాలి. ప్రతి చాప్టర్‌ను పబ్లిక్ పరీక్షల కోణంలో అధ్యయనం చేయాలి. దీంతోపాటు ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహా ప్రిపరేషన్ కొనసాగించాలి. కాలేజీలో నిర్వహించే నమూనా పరీక్షలకు హాజరుకావాలి. యూనిట్ టెస్ట్‌లు, వారాంతపు టెస్ట్‌లు రాస్తూ ప్రిపరేషన్‌లో తప్పొప్పులను విశ్లేషించుకోవాలి.
  • ముఖ్యమైన చాప్టర్ల(ఆయా పరీక్షలనుబట్టి) ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి. దీనికోసం 2015లో జరిగిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్నాలను విశ్లేషించి, వెయిటేజీ ఎక్కువ ఉన్న అంశాలను గుర్తించాలి.
  • జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు ప్రిపరేషన్ పూర్తిచేసిన తర్వాత జనవరి 20 వరకు రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్ పరీక్షలు పూర్తయిన పది రోజుల్లో జేఈఈ మెయిన్ పరీక్ష ఉంటుంది.

మ్యాథమెటిక్స్
ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మ్యాథ్స్ 2-ఎ, మ్యాథ్స్-2బి పేపర్లకు 75 చొప్పున మార్కులు కేటాయించారు. అధిక వెయిటేజీ ఉన్న చాప్టర్లను పరిశీలిస్తే...
  • బైనామియల్ థీరమ్ (16 మార్కులు)
  • ప్రాబబిలిటీ, రేండమ్ వేరియబుల్స్ (22 మార్కులు)
  • డిమూవియర్స్ థీరమ్-కాంప్లెక్స్ సంబర్స్ (17 మార్కులు)
  • సర్కిల్స్ (22 మార్కులు)
  • డెఫినిట్, ఇన్‌డెఫినెట్ ఇంటిగ్రేషన్‌‌స (33 మార్కులు)
  • డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ (13 మార్కులు)
  • స్టాటిస్టిక్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ (18 మార్కులు)

గత ఎంసెట్ ప్రశ్నపత్రాల ఆధారంగా సరాసరి వెయిటేజీ:
  • ఆల్జీబ్రా (26 మార్కులు)
  • క్యాలిక్యులస్ (19 మార్కులు)
  • కోఆర్డినేట్ జామెట్రీ (17 మార్కులు)
  • ట్రిగనోమెట్రీ (9 మార్కులు)
  • 3డీ వెక్టార్ ఆల్జీబ్రా (9 మార్కులు)
  • మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకు టిప్స్, ట్రిక్స్, సూత్రాలపై పట్టు సాధించాలి. వేగం చాలా ముఖ్యం కాబట్టి ఒక సమస్యకు సంబంధించిన అనేక మోడల్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
  • జేఈఈ మెయిన్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకు కాన్సెప్టులు, బేసిక్స్‌పై విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలి.
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అధిక స్కోర్ కోసం అప్లికేషన్స్ ఆధారిత సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.

ఫిజిక్స్
ఇంటర్మీడియెట్ సెకండియర్ ఐపీఈ ఫిజిక్స్ ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ పరీక్షల కోణంలో చూస్తే ఎలక్ట్రో స్టాటిక్స్, వేవ్ మోషన్, ఆప్టిక్స్ చాప్టర్లు కష్టమైనవిగా భావిస్తారు. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు అకాడెమీ పుస్తకాల్లోని అంశాలను క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్ వెనుక ఉన్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి.
  • వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.

ఎంసెట్, జేఈఈ మెయిన్-అడ్వాన్స్‌డ్:
  • ఎంసెట్ కోణంలో చూస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఫిజిక్స్ కష్టమైందిగా భావిస్తారు. అయితే ఈ సబ్జెక్టులోని కాన్సెప్టులపై పట్టు సాధించడం ద్వారా ఎక్కువ మార్కులను సొంతం చేసుకోవచ్చు.
  • సూత్రాలను అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి.
  • మూల సూత్రాలను పట్టిక రూపంలో రాసుకొని, వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి.
  • మొదటి సంవత్సరం సిలబస్‌లోని ఎనర్జీ, ద్రవ్యవేగ, కోణీయ వేగ నిత్యత్వ సూత్రాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • ఉష్ణగతిక శాస్త్రంలో ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా, సరళహరాత్మక చలనంలోని డోలనం, డోలనావర్తనకాలం.. వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.
  • సీనియర్ ఇంటర్ సిలబస్‌లోని కిర్కాఫ్స్ లాస్, ఫ్లెమింగ్ రైట్,లెఫ్ట్ హ్యాండ్ సూత్రాలు; ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని ప్రాథమిక ఫార్ములాలు నేర్చుకోవాలి.

గత ఎంసెట్ ప్రశ్నపత్రాల ఆధారంగా ఎంసెట్ ప్రశ్నల వెయిటేజీ:
    మొదటి సంవత్సరం:
  • యూనిట్స్ అండ్ డైమన్షన్స్-1 ప్రశ్న; వెక్టార్స్- 1; కైనమాటిక్స్- 2; డైనమిక్స్- 2; కొలిసన్స్, సెంటర్ ఆఫ్ మాస్- 2; ఫ్రిక్షన్- 1; రొటేటరీ మోషన్- 2; గ్రావిటేషన్- 1; సింపుల్ హార్మోనిక్ మోషన్- 1; ఎలాస్టిసిటీ- 1; సర్పేస్ టెన్షన్- 1; ఫ్లూయిడ్ డైనమిక్స్- 1; హీట్-4 ప్రశ్నలు.

    ద్వితీయ సంవత్సరం:
  • వేవ్ మోషన్- 2 ప్రశ్నలు; రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్- 3; మ్యాగ్నటిజం- 2; ఎలక్ట్రో స్టాటిక్స్- 2; కరెంట్ ఎలక్ట్రిసిటీ- 2; ఎలక్ట్రో మ్యాగ్నటిజం- 2; సెమీ కండక్టర్స్, న్లూక్లియర్ ఫిజిక్స్- 2; కమ్యూనికేషన్ సిస్టమ్స్- 1 ప్రశ్న.

కెమిస్ట్రీ
  • పబ్లిక్ పరీక్షల్లో ఫిజిక్స్ తరహాలోనే కెమిస్ట్రీకి 60 మార్కులు, ఎంసెట్‌లో 40 మార్కులుంటాయి. కెమిస్ట్రీ తెలుగు అకాడెమీ పుస్తకంలోని చాప్టర్లను క్షుణ్నంగా చదివితే ఐపీఈతో పాటు ఎంసెట్, జేఈఈ మెయిన్‌లో మంచి మార్కులు సాధించవచ్చు.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఈక్వేషన్స్‌ను వీలైనంతలో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి.
  • ఇంటర్మీడియెట్ కోణంలో చూస్తే సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంశాలు క్లిష్టమైనవిగా భావిస్తారు. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి. ఒక పద్ధతి ప్రకారం విశ్లేషణాత్మకంగా చదవటం ద్వారా వీటిపై పట్టు సాధించవచ్చు.
  • ఫిజికల్ కెమిస్ట్రీలోని ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో తప్ప, మిగిలిన కెమిస్ట్రీ చాప్టర్లలో ఇంటర్మీడియెట్ ప్రిపరేషన్‌కు, ఎంసెట్ ప్రిపరేషన్‌కు పెద్దగా తేడా ఉండదు.
  • ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంలో కెమిస్ట్రీ కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో సమాధానాలు గుర్తించేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది.
  • 70 నుంచి 80 శాతం ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని కెమికల్ సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్‌లోని నేమ్డ్ రియాక్షన్స్, ఆర్డర్ ఆఫ్ యాసిడ్స్, బేసిక్ స్ట్రెంథ్ అంశాలను బాగా గుర్తుంచుకోవాలి.
  • అన్ని సూత్రాలను నేర్చుకొని, వాటిపై ఆధారపడిన సమస్యలను సాధించాలి.

ఎంసెట్ వెయిటేజీ అంచనా:
మొదటి ఏడాది:
అటామిక్ స్ట్రక్చర్ (2 ప్రశ్నలు), పీరియాడిక్ టేబుల్ (ఒక ప్రశ్న), కెమికల్ బాండింగ్ (2), స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ (1), స్టాకియోమెట్రీ (1), థర్మోడైనమిక్స్(1), కెమికల్ ఈక్విలిబ్రియం-యాసిడ్స్ అండ్ బేసిస్(2), హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ (1), ఆల్కలి, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ (2), గ్రూప్ 13 ఎలిమెంట్స్ (1), గ్రూప్ 14 ఎలిమెంట్స్ (1), ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ (1), ఆర్గానిక్ బేసిక్స్, హైడ్రోకార్బన్స్ (4).
రెండో ఏడాది: సొల్యూషన్స్ (2 ప్రశ్నలు), సాలిడ్ స్టేట్ (1), ఎలక్ట్రో కెమిస్ట్రీ (2), మెటలర్జీ (1), గ్రూప్ 15 ఎలిమెంట్స్ (1), గ్రూప్ 16 ఎలిమెంట్స్ (1), గ్రూప్ 17 ఎలిమెంట్స్ (1), డి-బ్లాక్ ఎలిమెంట్స్ (1), నోబుల్ గ్యాసెస్(1), పాలిమర్స్ (1), కెమిస్ట్రీ ఇన్ ఎవిర్‌డే లైఫ్ (1), ఆర్గానిక్ కాంపౌండ్స్ (4), సర్ఫేస్ కెమిస్ట్రీ (1).

టిప్స్
  • కాలేజీలో లెక్చరర్ చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో వినాలి. ఇంటిదగ్గర ఆ చాప్టర్‌లోని అంశాలను సమీక్షించి, ప్రాక్టీస్ చేయాలి.
  • వారాంతపు ఐపీఈ నమూనా పరీక్షలను, ఆబ్జెక్టివ్ పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. బలాలు, బలహీనతలను గుర్తించాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవాలి.
  • రోజూ కాలేజీ సమయం తర్వాత కనీసం మ్యాథమెటిక్స్‌కు 3 గంటలు, ఫిజిక్స్‌కు గంటన్నర, కెమిస్ట్రీకి గంటన్నర కేటాయించాలి.
  • ఇంటర్ బోర్డు పరీక్షలు, ఇతర పోటీపరీక్షలకు సంబంధించి ముఖ్యమైన చాప్టర్లను గుర్తించి, ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి.
  • అన్ని చాప్టర్లలోని ముఖ్య భావనలను ఒకచోట రాసుకొని, బాగా చదవాలి.
  • ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. ఇలా చేయకుంటే ఒత్తిడి పెరుగుతుంది.
  • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి.
  • అవసరానికి తగినట్లు షార్ట్‌కట్స్, టిప్స్ ఉపయోగించాలి.
  • ఎంసెట్, జేఈఈకి సిద్ధమవుతున్నవారు తొలుత సబ్జెక్టు బేసిక్స్‌ను తర్వాత కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. చివర్లో అప్లికేషన్స్‌పై దృష్టిసారించాలి.
Published date : 27 Aug 2015 06:21PM

Photo Stories