ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్
Sakshi Education
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఎంతో కీలకం.. ముఖ్యంగా సెన్సైస్ విద్యార్థులకు.. ఈ క్రమంలో బైపీసీ విద్యార్థులు అకడెమిక్ పరంగా ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఎంసెట్, జిప్‌మర్, ఎయిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ వంటి పోటీ పరీక్షలకు సమాంతరంగా సన్నద్ధం కావాల్సి వస్తోంది.. ఈ నేపథ్యంలో అకడమిక్ పరీక్షలను పోటీ పరీక్షలను సమన్వయం చేసుకుంటూ ఏవిధంగా ప్రిపేర్ కావాలి.. ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? తదితర అంశాలపై సలహాలు, సూచనలు...
కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో మూడు విభాగాలు.. ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా విభాగాల వారీగా సమయాన్ని కేటాయించాలి.
సాలిడ్ స్టేట్ 6 గంటలు
సొల్యూషన్స్ 4 గంటలు
ఎలక్ట్రో కెమిస్ట్రీ 4 గంటలు
సర్ఫేస్ కెమిస్ట్రీ 3 గంటలు
మెటలర్జీ 8 గంటలు
పి-బ్లాక్ ఎలిమెంట్స్ 8 గంటలు
డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 8 గంటలు
కోఆర్డినేట్ కాంపౌండ్స్ 4 గంటలు
పాలిమర్స్ 4 గంటలు
బయో మాలిక్యూల్స్ 3 గంటలు
ఆర్గానిక్ కాంపౌండ్స్ 12 గంటలు
గెలుపు సూత్రాలు
ఫిజిక్స్ ఇంటర్మీడియెట్ బైపీసీలో అకడమిక్ లేదా పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపే క్రమంలో ఫిజిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం సమయపాలన, ఏకాగ్రత, సరైన ప్రణాళిక చాలా అవసరం.
-పి. కనక సుందర రావు, (శ్రీ గాయత్రి విద్యా సంస్థలు) |
బోటనీ ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం బోటనీలో 6 యూనిట్లు (14 చాప్టర్లు) ఉన్నాయి.
ప్లాంట్ ఫిజియాలజీ (28 మార్కులు); మైక్రోబయాలజీ (6 మార్కులు); జెనెటిక్స్ (6 మార్కులు); మాలిక్యులర్ బయాలజీ (8 మార్కులు); బయోటెక్నాలజీ (16 మార్కులు); ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు)
|
కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో మూడు విభాగాలు.. ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా విభాగాల వారీగా సమయాన్ని కేటాయించాలి.
- సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్.
- కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని దశలవారీగా రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.
సాలిడ్ స్టేట్ 6 గంటలు
సొల్యూషన్స్ 4 గంటలు
ఎలక్ట్రో కెమిస్ట్రీ 4 గంటలు
సర్ఫేస్ కెమిస్ట్రీ 3 గంటలు
మెటలర్జీ 8 గంటలు
పి-బ్లాక్ ఎలిమెంట్స్ 8 గంటలు
డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 8 గంటలు
కోఆర్డినేట్ కాంపౌండ్స్ 4 గంటలు
పాలిమర్స్ 4 గంటలు
బయో మాలిక్యూల్స్ 3 గంటలు
ఆర్గానిక్ కాంపౌండ్స్ 12 గంటలు
జువాలజీ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంతో పోల్చితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే ద్వితీయ సంవత్సరంతోపాటు మొదటి సంవత్సరం సిలబస్‌ను సమాంతరంగా చదవడమేకాకుండా.. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాల్సి వస్తోంది.
హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-1 (10 మార్కు లు); హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-2 (10 మార్కులు); హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-3 (8 మార్కులు); హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-4 (8 మార్కులు); హ్యూమన్ రీప్రొడక్షన్ (12 మార్కులు); జెనెటిక్స్ (12 మార్కులు); ఆర్గానిక్ ఎవల్యూషన్ (8 మార్కులు); అప్లయిడ్ బయాలజీ (8 మార్కులు).
|
గెలుపు సూత్రాలు
- పరీక్షల కోణంలో ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి.
- ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి.
- ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి.
- మొదటి నుంచి దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన, అతిస్వల్ప సమాధాన ప్రశ్నలతోపాటు బహుళైచ్ఛిక ప్రశ్నలపైనా దృష్టిసారించాలి.
- ఎంసెట్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు తొలుత సబ్జెక్టు బేసిక్స్‌ను తర్వాత కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. చివర్లో అప్లికేషన్స్‌పై దృష్టిసారించాలి.
- పాఠ్య పుస్తకాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇలాచేస్తే చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
Published date : 11 Jul 2014 03:03PM