Govt Junior Colleges: ఇంటర్ విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు
తొర్రూరు: జిల్లాలో ఇంటర్ కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా.. నేటికీ విద్యార్థులకు పా ఠ్య పుస్తకాలు అందలేదు. దీంతో చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ముద్రణ,సరఫరా లో సమస్యలు నెలకొన్నాయని అధికారులు చెబు తున్నారు. పుస్తకాలు లేకుండా బోధించడం కష్టంగా మారుతోందని అధ్యాపకులు వాపోతున్నారు.
10 కళాశాలలు..
జిల్లా వ్యాప్తంగా 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 2వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పేద విద్యార్థులు కావడంతో ప్రభుత్వం అందించే ఉపకారవేతనాలు, ఉచిత పుస్తకాలపైనే ఆధారపడి చదువుకుంటు న్నారు. జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కాగా.. నేటి వరకు పుస్తకాలు రాలేదు. రోజు కళాశాలకు వచ్చి అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలు విని వెళ్తున్నారు. పుస్తకాలు లేకపోవడంతో ఇంటి వద్ద చదువుకోవడానికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. త్వరగా పుస్తకాలు పంపిణీ చేస్తే చాలా ప్రయోజనం ఉంటుందని కోరుతున్నారు.
Scholarships: ప్రతిభ చూపే విద్యార్థులకు స్కాలర్‌షిప్
సీనియర్లవి సర్దుబాటు...
కొత్త పుస్తకాలు రాకపోవడంతో ప్రథమ సంవత్సర విద్యార్థులు పరిచయం ఉన్న సీనియర్ల వద్ద పాత పుస్తకాలు తీసుకొని చదువుతున్నారు. కళాశాల నుంచి వెళ్లిన విద్యార్థుల వద్ద గత సంవత్సర పుస్తకాలను ఇప్పించేలా కళాశాలల అధ్యాపకులు చొరవ తీసుకుంటున్నారు. అయితే అకాడమీ పుస్తకాలు ఇచ్చేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. బయట మార్కెట్‌లో సైతం పూర్తిస్థాయిలో పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో చేసేదేమి లేక విద్యార్థులు కేవలం అధ్యాపకులు చెప్పే పాఠాలు విని వెళ్తున్నారు.
సరఫరాలో ఇబ్బందులు..
గత విద్యా సంవత్సరం నూతన పుస్తకాలు ముద్రణ అయిన వెంటనే నేరుగా ఆయా కళాశాలలకు సరఫరా చేశారు. ఈ సారి అలాగే చేయాలని భావించినా సరఫరా, కొరియర్, పార్శిల్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన ఆమె ఇప్పటికే సరఫరాలో జాప్యం జరిగిందని వెంటనే జిల్లా నోడల్ అధికారి కార్యాలయానికి సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు జిల్లా వరకు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం.
School Holidays: విద్యాసంస్థలకు సెలవు
వర్షాలతో పంపిణీ ఆలస్యం
ఇటీవలే జిల్లాకు పుస్తకాలు వచ్చాయి. కురుస్తున్న వర్షాలతో సెలవులు రావడంతో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడంలో ఆలస్యమైంది. జిల్లాల వారీగా పుస్తకాలను సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెండు, మూడు రోజుల్లో అన్ని కళాశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఈ ఏడాది ఉత్తీర్ణత పెంపునకు కృషి చేస్తాం.
– సమ్మెట సత్యనారాయణ, జిల్లా ఇంటర్ విద్యాధికారి