Skip to main content

Scholarships: ప్రతిభ చూపే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

కొరుక్కుపేట: ఆకాష్‌ బైజూస్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ (ఆంతే) – 2023 బ్రోచర్‌ను ఆ సంస్థ నిర్వాహకులు జూలై 26న‌ ఆవిష్కరించారు.
Scholarships
ప్రతిభ చూపే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

14వ ఎడిషన్‌ అయిన వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్ష ఏడవ తరగతి నుంచి ప్లస్‌–2 విద్యార్థులు 100 శాతం స్కాలర్‌షిప్‌, నగదు బహుమతులతో ప్రతిభను నిరూపించుకునేందుకు వీలు కల్పిస్తోందని ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) సీఈఓ, అభిషేక్‌ మహేశ్వరి తెలిపారు. చైన్నెలో జూలై 26న‌ ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల కలలను సాకారం చేసుకునేందుకు ఆంతే వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

చదవండి: PM YASASVI: పేద విద్యార్థుల‌కు వ‌రం... ఏడాదికి ల‌క్ష‌రూపాయ‌ల‌కు పైగా ఉప‌కార‌వేత‌నం.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

2010లో ప్రారంభించినప్పటి నుంచి కోచింగ్‌ అవకాశాల ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులకు శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ నీట్‌, ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సిద్ధమయేందుకు వీలున్నట్లు తెలిపారు. ఆంతే– 2023 అక్టోబర్‌ 7 తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లో దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: Polytechnic Scholarships: పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు... ఏడాదికి రూ.50 వేలు!

Published date : 27 Jul 2023 03:04PM

Photo Stories