Skip to main content

Intermediate Admissions: అనూహ్యంగా పెరిగిన ఇంట‌ర్ అడ్మిష‌న్లు

ఇంట‌ర్ లో ఫెయిల్ అయితే మ‌ళ్ళీ అడ్మిష‌న్లు తీసుకోవ‌చ్చ‌నే ఆదేశం కార‌ణంగా ఈ సంవ‌త్సరం ఇంట‌ర్ ప్ర‌వేశాల‌లో విద్యార్థుల సంఖ్య ప్ర‌తీ ఏడాది కంటే కూడా ఈ ఏడాది ఎకంగా వెయ్యి దాటేసింది. ఈ కార‌ణంగా ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లను చేప‌ట్టంది.
Inter Admission Numbers Soar in 2023,Over 1000 Students Enroll in Inter This Year,Raise of admissions of students in intermediate colleges,Record Inter Admissions Numbers in 2023
Raise of admissions of students in intermediate colleges

సాక్షి ఎడ్యుకేష‌న్: 2023 – 24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు అనూహ్యంగా పెరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో గతేడాది కంటే 6,008 మంది అదనంగా ప్రవేశం పొందారు. ఫెయిలైన విద్యార్థులకు రీ – అడ్మిషన్‌ తీసుకునే అవకాశం కల్పించినందున ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు భావిస్తున్నారు. డ్రాపవుట్‌ లేకుండా ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులందరినీ కాలేజీల వైపు తీసుకొచ్చేలా శ్రద్ధ తీసుకోవాలని విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.

దీంతో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్‌ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సైతం గతేడాది కంటే వేయికి పైగా అడ్మిషన్లు పెరగడం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితమేనని విద్యావేత్తలు అంటున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి సైతం విద్యార్థులు ఉన్నత విద్యవైపు వస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

Teachers Promotions: ఉపాధ్యాయుల ప‌దోన్న‌తుల స‌మావేశం

అదనపు సెక్షన్లకు డిమాండ్‌

ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో అదనపు సెక్షన్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరంలో అదనపు సెక్షన్ల నిర్వహణకు అనుమతి కోసమని 89 కాలేజీల వారు దరఖాస్తు చేయగా, 2023–24 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 103 కాలేజీల నుంచి అదనపు సెక్షన్ల మంజూరీ కోసమని దరఖాస్తు చేసుకున్నారు. ఆయా కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు, ఫ్యాకల్టీ, ప్రయోగశాలలు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి అనుమతులు ఇస్తున్నారు. ఇందుకోసమని విశాఖలో 3, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కోటి చొప్పున జిల్లా అధికారులతో కూడిన కమిటీలను నియమించారు.

Formative Assessment-2: పాఠ‌శాల విద్యార్థుల‌కు ఎఫ్ఏ-2 ప‌రీక్ష‌లు మొద‌లు

రీ అడ్మిషన్‌ తీసుకుంటే బంపర్‌ ఆఫర్‌

విశాఖలో 7,733 మంది, అనకాపల్లిలో 5,491 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 768 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫెయిలయ్యారు. వీరితో రీ అడ్మిషన్‌ తీసుకునేలా, అందుకు వారు అంగీకరించిన పక్షంలో తప్పనిసరిగా పరీక్ష ఫీజు కట్టించేలా తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు తిరిగి కాలేజీల్లో చేరినట్లైతే, రెగ్యులర్‌ విద్యార్థులతో సమానమైన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. పోయిన సబ్జెక్టులు పాసైన తర్వాత, సర్టిఫికెట్‌పై రెగ్యులర్‌గానే గుర్తిస్తారు. అంతేకాకుండా సబ్జెక్టులు అన్నీ రాసినా, ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకునేలా విద్యార్థులకు అరుదైన అవకాశాన్ని కల్పించారు.

Polytechnic Admissions: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

విశాఖలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో తరగతులకు హాజరైన విద్యార్థులు

అవకాశాలను వినియోగించుకోవాలి

పదో తరగతి తర్వాత డ్రాపవుట్‌ అనేది ఉండకూడదనే ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా కాలేజీల ప్రిన్సిపాళ్లతో తరచూ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నాం. రెగ్యులర్‌తోపాటు, ఫెయిలైన విద్యార్థులకు కూడా మేలు చేసేలా వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాళ్లు శ్రద్ధ తీసుకోవాలి.

Department of Education: స్పౌజ్‌ టీచర్ల దరఖాస్తుల పరిశీలన

            – రాయల సత్యనారాయణ, ఆర్‌ఐవో,
                 ఉమ్మడి విశాఖ జిల్లా

Published date : 04 Oct 2023 08:51AM

Photo Stories