Teachers Promotions: ఉపాధ్యాయుల పదోన్నతుల సమావేశం
సాక్షి ఎడ్యుకేషన్: టెట్‌తో సంబంధం లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ చవాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్), జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం ఓల్డ్ హోంసింగ్ బోర్డ్‌లోని మాధవ నిలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ ఉపాధ్యాయులందరికీ స్కూల్ అసిస్టెంట్లుగా, భాషా పండితులందరికీ టెట్‌తో నిమిత్తం లేకుండా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలన్నారు.
TET Petition by Teachers: టెట్ పరీక్షలు.. ఉపాధ్యాయుల పదోన్నతులు?
ఇతర శాఖల్లో పనిచేస్తున్న స్పౌజ్ ఉద్యోగులు గత 5,8 సంవత్సరాలుగా స్పౌజ్ వాడుకోలేదనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. వారి సర్వీస్ రిజిస్టర్స్‌ను వెరిఫై చేసి బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీ కమిటీ నియమించి 25శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందులో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు గోపీకృష్ణ, ఆర్థిక కార్యదర్శి బచ్చవార్ నారాయణ, నాయకులు కుమ్ర యాదవ్‌రావ్, బత్తుల గంగాధర్, సురేష్ జోషి, బలిరాం తదితరులు పాల్గొన్నారు.