Municipal Teachers Promotion : ఉపాధ్యాయుల ప్రమోషన్లపై విమర్శలు.. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ఇలా!
అమరావతి: రోస్టర్ ప్రకటించకుండా పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండురోజుల క్రితం శుక్రవారం గుర్తింపు పొందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం విద్యాశాఖ వెల్లడించింది.
TGPSC Group 1 Jobs: ఈ రెండు కేటగిరీల్లో తీవ్ర పోటీ!.. ఒక్కో పోస్టుకు ఇంత మంది పోటీ!
అప్పటి సమావేశంలో మున్సిపల్ టీచర్ సంఘాలు గానీ, వారి ప్రతినిధులు గానీ లేకుండా తీసుకున్న నిర్ణయం మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. సోమవారమే సీనియారిటీ లిస్టు ప్రకటించడంతో పాటు అభ్యంతరాల స్వీకరణకు అవకాశమిచ్చింది. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ టీచర్ల పదోన్నతులపై సర్విస్ రూల్స్, కోర్టు తీర్పులు పరిశీలించకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చట్టాలకు లోబడే సర్విస్ రూల్స్..
రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లో 2,115 మున్సిపల్ పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి 2018లో మున్సిపల్ శాఖ పరిధిలోనే పదోన్నతులు కల్పించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలు చేసిన విధానాలనే మున్సిపల్ స్కూళ్లలోనూ అమలు చేస్తున్నారు. అయితే, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ మాత్రం మున్సిపల్ చట్టాలకు లోబడే ఉన్నాయి. విద్యా సంబంధమైన అంశాల్లో రెండు విభాగాల స్కూళ్లల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రెండేళ్ల క్రితం విద్యాశాఖ జీవో నం.84 జారీ చేసింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
దీని ప్రకారం అకడమిక్, పరిపాలనా పరమైన అంశాలను పాఠశాల విద్యాశాఖకు బదలాయించారు. దీనిపై మున్సిపల్ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి విషయంలో హైకోర్టు తుది తీర్పునకు లోబడే పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇచ్చే పదోన్నతులు విద్యాశాఖ చట్టాల ప్రకారం ఇస్తున్నారా లేక మున్సిపల్ చట్టాల ప్రకారం కల్పిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 26 తేదీతో సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. కాగా, మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ అభ్యంతరకరంగా ఉందని, చివరిగా ఇచి్చన పదోన్నతుల్లో ఏ పోస్టుకు ఏ రోస్టర్ పాయింట్ వద్ద ఆగిందో వెల్లడించలేదని రాష్ట్ర మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ అన్నారు. రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో కూడా తెలియదన్నారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
విద్యాశాఖ ప్రకటించిన పదోన్నతుల షెడ్యూల్ ఇదీ..
⇒ 28–10–2024 సీనియారిటీ తాత్కాలిక జాబితా ప్రకటన
⇒ 28 నుంచి నవంబర్ 1 వరకు అభ్యంతరాల స్వీకరణ
⇒ 4న సీనియారిటీ తుది జాబితా విడుదల
⇒ 6న గ్రేడ్–2 హెచ్‌ఎంల కౌన్సెలింగ్
⇒ 8న స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్
Tags
- roaster system
- Teachers Promotions
- Municipal schools
- ap school teachers
- criticism on education department
- AP education department
- promotion schedule of ap school teachers
- municipal teachers
- ap municipal schools
- Criticism on Education Department
- promote teachers
- no announcement of roaster
- Education News
- Sakshi Education News