Skip to main content

TET Petition by Teachers: టెట్ ప‌రీక్ష‌లు.. ఉపాధ్యాయుల‌ ప‌దోన్న‌తులు?

ఉపాధ్యాయులు వారి ప‌దోన్న‌తుల నేప‌థ్యంలో కోర్టును ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలోనే మ‌ద్రాస్ కోర్టు ప‌దోన్న‌తులు పొందాలంటే టెట్ ప‌రీక్ష‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా విజ‌య‌వంతం చేసుకోవాల‌ని ఆదేశాన్ని జారీ చేసింది. ఈ అంశాన్ని ఉపాధ్యాయులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంత‌కీ ఈ టెట్, ఉపాధ్యాయుల ప‌దోన్న‌తుల తంట ఎంటో తెలుసుకుందాం..
TET Teachers passing the petition letter to DEO officer
TET Teachers passing the petition letter to DEO officer

టెట్‌ ఉంటేనే పదోన్నతి కల్పించాలి

టెట్‌ అర్హత సాధించిన ఉపాధ్యాయులకే పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో టెట్‌ పాసైన వారి పేర్లు చేర్చలేదు. 2000 సంవత్సరం నుంచి 2017 వరకు జిల్లాలో వందలాది మంది టెట్‌ ఉత్తీర్ణత సాధించారు. వీరిని కాదని అర్హత సాధించని వారికి పదోన్నతులు ఇవ్వడం సరికాదు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం బీఎడ్‌, డిగ్రీ, టెట్‌ అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రమోషన్‌ కల్పించాలి.

    – కాంబ్లే విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయుడు

సీనియర్లకు అన్యాయం..

2010 ఆగస్టుకు ముందు నియామకం అయిన వారికి టెట్‌ అవసరం లేదని ఎన్‌సీటీఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. 34 ఏళ్లుగా పదోన్నతి కోసం నిరీక్షిస్తున్నాం. ప్రభుత్వం పదోన్నతులు కల్పించి టెట్‌ ఉత్తీర్ణత సాధించేందుకు ఐదేళ్ల గడువు ఇవ్వాలి. ఉద్యోగ విరమణ పొందే సమయంలో ఉపాధ్యాయులు కోర్టు చుట్టూ తిరగాలా.. సీనియర్‌ ఉపాధ్యాయులకు అన్యాయం చేయకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి.

TS TET 2023: టెట్‌ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!

   – లక్ష్మణ్‌రావు, ఉపాధ్యాయుడు

పదోన్నతులు వస్తాయని సంతోషపడ్డ గురువుల్లో గుబులు మొదలైంది. పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో ఉత్తీర్ణులై ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప‌దోన్న‌తుతి కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న సీనియర్‌ ఉపాధ్యాయుల్లో నిరాశ అలుముకుంది. పదోన్నతుల ప్రక్రియ జరుగుతుందో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు ఉపాధ్యాయులు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ఈ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం లేకపోలేదు. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో పదోన్నతి పొందకుండా ఉద్యోగ విరమణ చెందుతామని సీనియర్‌ ఉపాధ్యాయులు నిరుత్సాహంలో ఉన్నారు. మరో వైపు టెట్‌ అర్హత సాధించిన ఉపాధ్యాయుల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో పదోన్నతులు ముందుకు సాగుతాయా.. లేక ఆగిపోతాయా అనేది త్వరలో తేలనుంది. కాగా టెట్‌ అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఆదివారం డీఈవో ప్రణీతను కలిసి వినతి పత్రం సమర్పించారు.

School Bags: బడి బ్యాగు బరువు తగ్గించాలి!

ఎస్‌ఏకు టెట్‌ తప్పనిసరి..

ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఎస్జీటీ తత్సమాన క్యాడర్‌ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి పొందాలంటే టెట్‌ పేపర్‌–2 తప్పనిసరి అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీనియారిటీ జాబితాలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యూకేషన్‌ (ఎన్‌సీటీఈ)లో నిర్మల్‌ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయంలో మద్రాస్‌ హైకోర్టు ప్రమోషన్‌కు టెట్‌ తప్పనిసరి అని తీర్పునిచ్చిందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల తరఫున వాదనలు విన్న కోర్టు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతికి టెట్‌ తప్పనిసరి అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ ప్రక్రియ ముందుకు సాగితే పీఎస్‌ హెచ్‌ఎం, సాంఘిక శాస్త్రం 1989 డీఎస్సీ, బయోసైన్స్‌ వారికి 1996 డీఎస్సీ, గణితం, ఫిజికల్‌ సైన్స్‌ 2002 డీఎస్సీ వారికి పదోన్నతులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 220 మంది పదోన్నతులు పొందనున్నారు.

Polytechnic Admissions: ఈనెల 3వ తేదీన పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిష‌న్స్

భిన్నాభిప్రాయాలు..

స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి అన్న విషయంలో ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్‌ ఉపాధ్యాయులు టెట్‌ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల్లో కూడా 2010కి ముందు నియామకం అయినవారికి టెట్‌ తప్పనిసరి కాదని, ఆ తర్వాత నియామకమైన డీఎస్సీలకు తప్పనిసరి అని వారు చెబుతున్నారు. పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సమయంలో ఈ విషయం తెరపైకి తేవడం సరి కాదంటున్నారు. తాము పదోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ పొందాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెట్‌ అర్హత సాధించిన ఉపాధ్యాయులు మాత్రం ఆర్టీఈ 2009, ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్‌ అర్హత సాధించిన ఎస్జీటీలకు మాత్రమే ఎస్‌ఏ పోస్టులకు ఎంపిక చేయాలని వారు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు అమలు చేయాలని పేర్కొంటున్నారు.

Global Teacher Prize: గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ జాబితాలో ఏపీ టీచర్‌

నిలిచిపోనున్న పదోన్నతులు..

ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల బదిలీలు, స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల ప్రక్రియ జరిగింది. నేడో, రేపో స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే టెట్‌ తెరపైకి రావడంతో పదోన్నతులు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కోర్టులో రీపిటిషన్‌ వేయాల్సి ఉంది. అప్పటివరకు ఈ ప్రక్రియ ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఈనెలలోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్నట్లు తెలుస్తోంది.

TS TET 2023: ఇంత‘కీ’ ఏం జరిగింది!.. సామాజికవర్గాల వారీగా టెట్‌ అర్హత ఇలా..

ఒకవేళ అదే జరిగితే పదోన్నతుల ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు దాదాపు 350 వరకు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల ద్వారా 220 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఖాళీగా ఉన్న పోస్టులతో విద్యార్థుల చదువులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. బదిలీ, పదోన్నతులు చేపట్టడంతో ఉత్సాహంగా ఉన్న ఉపాధ్యాయులు టెట్‌ తెరపైకి రావడంతో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
 

Published date : 02 Oct 2023 02:30PM

Photo Stories