Skip to main content

Global Teacher Prize: గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ జాబితాలో ఏపీ టీచర్‌

లండన్‌: గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌–2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లున్నాయి.
Global Teacher Prize
గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ జాబితాలో ఏపీ టీచర్‌

టాప్‌–50 జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న పి.హరికృష్ణతోపాటు బెంగాల్‌ లోని ఆసన్‌సోల్‌ జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్‌ దీప్‌ నారాయణ్‌ నాయక్‌ ఉన్నారు.

చదవండి: Teacher as SI: ఎస్ఐగా విజ‌యం పొందిన ఉపాధ్యాయురాలు

130 దేశాల నుంచి అందిన 7 వేలకు పైగా నామినేషన్ల నుంచి ఈ 50 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో ఉన్న 10 మంది నుంచి విజేతను ఈ ఏడాది చివర్లో గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ అకాడమీ ప్రకటించనుంది. వర్కీ ఫౌండేషన్, యునెస్కో, యూఏఈకి చెందిన దుబాయ్‌ కేర్స్‌ కలిసి ఏ టా విజేతకు ఈ అవార్డు కింద 10 లక్షల అమెరికన్‌ డాలర్లను అందజేస్తాయి. 

చదవండి: ‘టెట్‌ ఉత్తీర్ణులైతేనే పదోన్నతి అనడం విచారకరం’

Published date : 02 Oct 2023 01:27PM

Photo Stories